telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వాషింగ్‌టన్ నుంచి ఫ్లొరిడా ప్రయాణమైనా ట్రంప్…

trump usa

అమెరికా ఎన్నికల్లో బైడెన్ విజయాన్ని నిరాకరించిన ట్రంప్ ఇప్పుడు బైడెన్‌కు సానుకూల వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అయితే డొనాల్డ్ ట్రంప్ర అమెరికా అధ్యక్షుడు అయిన్నప్పటి నుంచి ఎన్నో సంచలన నిర్ణయాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. ట్రంప్ తన టెంపరితనంతో రెండు సార్లు అభిశంసనం ఎదుర్కొన్నారు. అంతేకాకుండా ఎంతో అప్రదిష్టను కూడా మూటగట్టుకున్నారు. దాంతో నవంబర్ 3న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని చవిచూశాడు. అయినా సరే వైట్‌హౌస్‌ నుంచి తాను వెళ్లే వరుకు తన పరాజయాన్ని ఓప్పుకోలేదు. అయితే నేడు అధ్యక్ష హోదాలోనే వాషింగ్‌టన్‌ను విడిచి వెళ్లారు. ఈ క్రమంలో వాషింగ్‌టన్ నుంచి ఫ్లొరిడా వెళ్లే ముందు జాయింట్ బెస్ ఆండ్రూన్ దగ్గర వీడ్కోలు ప్రసంగం ఇచ్చారు. కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వానికి అధికారం అప్పగిస్తున్నానన్న ట్రంప్.. తన రాజకీయ జీవితం ఇప్పుడే మొదలైందని అన్నారు. రాజధాని భవనంపై దాడిని ఖండించడంతో పాటు రాజకీల అల్లర్లు అగ్రరాజ్యానికే అవమానం అన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ తొలిసారి జో బైడెన్‌కు సానుకూలంగా మాట్లాడాడం గమనార్హం. అమెరికా పౌరులందరూ బైడెన్ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇవ్వాలని, రానున్న కొత్త ప్రభుత్వానికి అన్ని విధాల సహకరించాలని కోరారు. దాంతో పాటుగా బైడెన్ పరిపాలన విజయవంతం కావాలని ప్రార్థనలు చేయమని చెప్పారు. గత వారం రోజులుగా బయటకు రాని ట్రంప్ చివరకు వైట్‌హౌస్‌ను వదిలేముందు కనిపించారు. అంతకు ముందే ప్రమాణస్వీకారం కోసం వాషింగ్‌టన్‌కు ప్రయాణం అవుతూ జో బైడెన్ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు.

Related posts