telugu navyamedia
రాజకీయ వార్తలు

కరోనా ‘చైనీస్ వైరస్‌’ అనేది సరైన పదమే: ట్రంప్

trump usa

కరోనాను ‘చైనీస్‌ వైరస్‌’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ట్వీట్‌పై చైనా మండిపడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాను చేసిన వ్యాఖ్యలపై ట్రంప్‌ మరోసారి స్పందించారు. ఆ వైరస్‌ ఎక్కడి నుంచి వ్యాప్తి అయిందో ఆ ప్రాంత పేరు పెట్టి పిలవడం తప్పుకాదని తెలిపారు.

కరోనా వ్యాప్తికి అమెరికాయే కారణమంటూ చైనా ఆరోపణలు చేయడం ఏ మాత్రం సరికాదని ట్రంప్ తెలిపారు. అమెరికా సైన్యం వల్లే వైరస్‌ చైనాకు పాకిందంటూ తప్పుడు ఆరోపణ చేశారన్నారు. చైనీస్‌ వైరస్‌’ ప్రభావం వల్ల నష్టపోతోన్న ఎయిర్‌లైన్స్‌ వంటి పరిశ్రమలకు అమెరికా పూర్తిగా సహకారం అందిస్తుందని తెలిపారు.

తిరిగి గతంలో ఎన్నడూ లేనంత బలంగా తాము తయారవుతామని ట్రంప్‌ అన్నారు.కరోనా ‘చైనీస్ వైరస్‌’ అనేది సరైన పదమేనన్నారు. తమ దేశం నుంచి చైనాకు ప్రయాణాలను నిషేధించి తాను మంచిపని చేశానన్నారు. దీనివల్ల ముడిసరకు దిగుమతుల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్న వాదనను ఆయన తిరస్కరించారు.

Related posts