telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గృహ విద్యుత్తు వినియోగదారులకు బంపర్ ఆఫర్!

current meeter billing

గృహ విద్యుత్తు గృహ విద్యుత్తు వినియోగదారులకు డిస్కమ్‌లు బంపర్ ఆఫర్ ప్రకటించాయి. ఇప్పటి వరకూ ప్రభుత్వ కార్యాలయాలకే ప్రీ పెయిడ్‌ మీటర్ల విధానం అమల్లో ఉండగా.. తాజాగా ఇళ్లకు కూడా అందుబాటులోకి తీసుకు రావాలని డిస్కమ్‌లు నిర్ణయించాయు. వీటిని పెట్టుకునేందుకు వినియోగదారులు స్వచ్ఛందంగా ముందుకు వస్తే.. వారికి విద్యుత్తు చార్జీల్లో యూనిట్‌కు రూ.0.10 దాకా రాయితీ ఇవ్వాలని యోచిస్తున్నాయి. ఈ మేరకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్‌)లో ఈ ప్రతిపాదనను చేర్చాయి.

ఒక్కో సింగిల్‌ ఫేజ్‌ ప్రీపెయిడ్‌ మీటర్‌కు రూ.8 వేలు అవుతుండగా.. త్రీ ఫేజ్‌ మీటర్‌కు రూ.12 వేలు అవుతుంది. కాగా, ఏఆర్‌ఆర్‌ నివేదికను ఇప్పటికే సిద్ధం చేసిన డిస్కమ్‌లు.. నెలాఖరులోగా దానిని దాఖలు చేయాలని నిర్ణయించాయి. ఈనెల రెండో వారంలో ట్రాన్స్‌కో సీఎండీ దే వులపల్లి ప్రభాకర్‌ రావు విదేశీ పర్యటన ముగించుకొని రాగానే ఆయనతో చర్చించి.. విధాన నిర్ణయం తీసుకోనున్నారు.

Related posts