telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

మొన్న బంగారంతో టాయిలెట్… నేడు డాలర్లతో కుర్చీ… ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం..

dollar note chair costs 17cr in russia

ఒక్కొక్కరికీ ఒక్కో ఆలోచన పుడుతుంటుంది. మొన్న ఒక వ్యాపారి బంగారంతో టాయిలెట్ చేయించాడు. ఇప్పుడు మరో వ్యక్తి కుర్చీ, అయితే ఇది బంగారంతో కాదు, కరెన్సీ కట్టలతో తయారు చేశారు. తాజాగా రష్యా రాజధాని మాస్కోలో నోట్ల కట్టలతో తయారు చేసిన కుర్చీ ప్రత్యేక ఆకర్షణీయంగా మారింది. అయితే ఈ కుర్చీని ఎవరూ తయారు చేయించుకోలేదు. ఔత్సాహికులే కుర్చీని తయారు చేసి ప్రదర్శనలో ఉంచారు. ఈ కుర్చీని చూసేందుకు అక్కడి జనం క్యూ కడతున్నారు. ఆసక్తి ఉన్న వారెవరైనా దీన్ని కొనుక్కోవచ్చని ఔత్సాహికులే ఆఫర్ ఇచ్చారు. గాజు పలకుల మద్య కరెన్సీ ని ఉంచి తయారుచేసిన కుర్చీ.

ఇలా తయారు చేయడానికి చాలా కష్టపడ్డామని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే మీరు ఈ కుర్చీని కొనుక్కోవడానికి మాత్రం మాస్కోకి వెళ్లాల్సిందే మరి. ధర మాత్రం మనం అనుకున్నట్లుగాలేదండోయ్. కుర్చీ ధర పదిలక్షల డాలర్లు అంటే మన కరెన్సీలో ఏడు కోట్ల 17 లక్షల రూపాయలు చెల్లించాలి మరి. అబ్బో…ఇంత ఖరీదా అనుకుంటున్నారా? గాజు పలకలతో ఫ్రేం తయారుచేసి వాటి మధ్య డాలర్ల కట్టలు ఉంచడం వల్లే ఇంత ఖరీదు. మరి ఈ కుర్చీని కొనే వారు ఉన్నారంటారా.. అంత డబ్బు పెట్టి కుర్చీని కొనుకున్నే ఆ విచిత్రాశక్తి ఎవరికి ఉందొ మరి!

Related posts