telugu navyamedia
andhra news telugu cinema news trending

ఆవు దూడకు పాలిస్తున్న… శునకం…

dog feeding a calf

చూసి నేర్చుకో..అనే మాట పెద్దలు అంటూ ఉంటారు.. ఎప్పుడైనా మీరు వినే ఉంటారు. దానికి సరైన అర్ధం చెప్పే ఉదాహరణ ఒకటి జరిగింది. కొందరికి చూసి నేర్చుకోమని చెప్పినా కూడా అర్ధం కాకపోవచ్చు, కానీ ఇలాంటివి చూస్తే విషయాన్నీ పట్టుకుంటారు. అందుకే సృష్టిలో ఇలాంటివి ఆ పైవాడు కూడా చేస్తూంటాడేమో. మనిషి జన్మ ఎంత ఉత్తమమైనదైనా, దానిని ఎంత నీచంగా ఉపయోగించుకుంటున్నామో తెలిసిందే. కానీ జంతువులూ అయిఉంది కూడా, ఒకరికి ఒకరు ఎలా సహకరించుకుంటున్నాయో అనిపిస్తుంది.. ఈ ఉదాహరణ చూస్తే… ఇంతకీ అదేమిటి అంటారా.. ఒక కుక్క ఆవుదూడకు పాలుఇస్తున్న సంఘటన ఒకటి జరిగింది.

సాధారణంగా, కుక్కకు విశ్వాసంతో పాటు ప్రేమ కూడా ఎక్కువని చెబుతారు. ఈ విషయం నిజమనేలా విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంజేరు గ్రామంలో ఓ ఘటన గురువారం వెలుగుచూసింది. రైతు పల్లంట్ల సూర్యారావు ఇంటి సమీపంలో పశువులశాలలో ఉన్న ఆవుదూడ వద్దకు శునకం వచ్చి పాలిచ్చింది. వారం రోజులుగా ఇలాగే చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ శునకానికి ఇటీవల కుక్కపిల్లలు జన్మించాయని, అవన్నీ మృతి చెందాయని, అప్పటి నుంచి తన పిల్లలా ఆవుదూడను కుక్క సాకుతోందని చెబుతున్నారు.

Related posts

కొప్పినీడి వారి ఆహ్వానం మేరకు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

vimala p

పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న.. రజత్ కుమార్…

vimala p

బ్లేడుతో.. బండ్లగణేష్… ఆపాలంటున్న అధిష్టానం…

vimala p