telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు సామాజిక

జాగిలాలతో స్నేహం.. గుండెకు మంచిదేనట.. వైద్యుల నిర్ధారణ..

dog as pet is healthy said doctors

పేరుకే మనుషులమైన అంతకంటే గొప్ప విషయాలు ఇతర జీవులలో ఉండటం విశేషం. వాటిలో ఎక్కువగా ఇళ్లలో పెంచుకోతగ్గది కుక్క. కుక్క అనగానే విశ్వాసానికి పెట్టింది పేరు. ఇప్పటికే ఎన్నో సార్లు యజమాని కోసం సాహసాలు చేసిన జాగిలాల గురించి వినే ఉంటాం. మనుషులకు కుక్కలను పెంచుకోవడం మాములే. కొందరైతే సాటిమనుషులకన్నా కూడా ఈ జీవాలనే నమ్ముతుంటారు. అయితే ఇలాంటి వారికి తొందరగా గుండె జబ్బులు రావని పరిశోధనలలో నిపుణులు తేల్చారు. ఒక్కసారి ఆహారం పెడితే వారిని మర్చిపోకుండా సాయం చేస్తుంది కుక్క. కుక్కలు పెంచుతున్న వాళ్ళు అటు శారీరికంగా.. ఇటు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని స్వీడన్‌కు చెందిన పరిశోధకులు వెల్లడించారు. అంతేకాకుండా హార్ట్ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు పెంచుతుంటే.. వారు కాస్త ఎక్కువ కాలం జీవిస్తారట.

దీన్ని రుజువు చేస్తూ వారు దాదాపు 20 ఏళ్ళ క్రితం గుండె జబ్బుల బారిన పడిన వాళ్ళను ఎంపిక చేసి.. వారిలో ఎంతమంది కుక్కలను పెంచారో.. ఎవరెవరు పెంచలేదన్నది లెక్కలు కట్టి.. వాళ్ళ జీవనకాలాన్ని అధ్యయనం చేశారట. అందులో కుక్కలను పెంచినవాళ్ల మరణాల సంఖ్య 33 శాతం తక్కువగా ఉండటం గమనార్హం. ఒంటరిగా జీవిస్తూ కుక్కలు పెంచుకుంటున్న వారి మరణాలు కూడా 15 శాతం తక్కువగా ఉన్నాయట. దీని బట్టి చూస్తే.. ఒంటరితనంతో బాధపడే వారు.. గుండె జబ్బులు కలిగి ఉన్న వారు కుక్కల్ని పెంచుకుంటే.. వారి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం అని పరిశోధకులు సలహా ఇస్తున్నారు. ఏది ఏమైనా రోజువారీ జీవితంలో మనకి కలిగే బాధలను మర్చిపోవడానికి తోడుగా ఓ కుక్క ఉంటే మానసికంగా అన్నీ కూడా మర్చిపోగలం.

Related posts