డాక్టర్ల మధ్య గొడవ… బలవుతున్న రోగులు…

పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్లు అలసత్వం వహించడం ఎవరూ సహించరు.

వారి మధ్య వచ్చే మస్పర్థల వల్ల పేషంట్లు ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయ్. ప్రజలు ఛీ కొట్టినా ప్రభుత్వం హెచ్చరించినా వారి బుద్ధి మాత్రం మారదు.

తాజాగా కంటి ఆపరేషన్ చేయడానికి ఐదుగురు పేషంట్లను ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లి మత్తుమందు కూడా ఇచ్చారు. కంటి ఆపరేషన్ మొదలు పెట్టకుండా డాక్టర్లు ఒకరితో మరొకరు ఘర్షణకు దిగారు.

అది పెరిగి ఒకరికొకరు దూషించుకునే స్థాయికి వెళ్ళిపోయింది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ పేషంట్లను అలాగే వదిలిపెట్టి వారు మాత్రం బయటకు వెళ్ళిపోయారు. ఇది చూసి పేషంట్ల తాలూకు బంధువులు డాక్టర్లను శాపనార్థాలు పెట్టడం ప్రారంభించారు.

ఈ డాక్టర్లకు పేషంట్ల ప్రాణాలంటే లెక్కలేకుండా పోయింది. ఇలాంటి వారిని ప్రభుత్వం ఎందుకు కొనసాగిస్తోందో అర్థం కాదు…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *