• Home
  • వార్తలు
  • న్యాయ కోవిదుడు..పాటిబండ్ల మృతి…సీఎం దిగ్బ్రాంతి…
Trending Today రాజకీయ వార్తలు వార్తలు సామాజిక

న్యాయ కోవిదుడు..పాటిబండ్ల మృతి…సీఎం దిగ్బ్రాంతి…

doctor patibandla chandrasekhararao died

ప్రముఖ న్యాయ కోవిదుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ పాటిబండ్ల చంద్రశేఖరరావు(82) మృతి చెందారు. గత రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయనకు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. నేటి ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి.

కృష్ణా జిల్లాలో ఏప్రిల్ 22, 1936లో వీరులపాడులో పాటిబండ్ల జన్మించారు. మద్రాస్ యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్, పీహెచ్డీ చేశారు. 1963-67 వరకు ఇండియాన్ సొసైటీ ఫర్ ఇంటర్నేషనల్ లా ఇన్స్టిట్యూట్ లో పరిశోధకుడిగా పనిచేశారు. నెహ్రు హయాంలో రక్షణ మంత్రిగా పని చేసిన వీకే కృష్ణ మీనన్ దీనిని ప్రారంభించారు. 1994-2000 వరకు అదే సంస్థకు అధ్యక్షుడిగా పాటిబండ్ల పని చేశారు. 1967లో విదేశీవ్యవహారాల శాఖలో పని చేశారు. దేశం కోసం 18 ఏళ్లపాటు సముద్ర న్యాయ వివాదాల ట్రిబ్యునల్ లో సేవలు అందించిన ఏకైక వ్యక్తి పాటిబండ్ల చంద్రశేఖరరావు.

ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత విభాగంలో న్యాయసలహా దారుడిగా 1972-76 వరకు పనిచేశారు. కేంద్ర న్యాయశాఖలలోను వివిధ విభాగాలలో అనేక హోదాలలో పనిచేశారు. 1996 నుండి సముద్ర చట్టాల న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయన సేవలకు గాను 2012లో ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో పాటిబండ్ల ను సత్కరించింది.

పాటిబండ్ల మృతి పట్ల చంద్రబాబు ప్రగాఢ సంతాపం తెలిపారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.రమణ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Related posts

టీఆర్ఎస్ పాలనలో.. ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం: తలసాని

madhu

పెరగనున్న..ఉల్లి..చమురు ధరల పెరుగుదలతో..ఇక మొదలవనున్న వడ్డింపు…

chandra sekkhar

మనోజ్ ని నోరు అదుపులో పెట్టుకోమంటున్న మా అసోసియేషన్… సీరియస్

nagaraj chanti

Leave a Comment