telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

అప్పుడే పుట్టిన పసిబిడ్డ… డాక్టర్ చెయ్యి జారి…

Just-Born

అమెరికాలోని అరిజోనాకు చెందిన ఓ జంటకు ఈ దారుణమైన సంఘటన ఎదురైంది. నెలలు నిండకుండానే పుట్టిన ఇద్దరు కవల పిల్లల్లో ఒకరిని శుభ్రం చేస్తున్న సమయంలో.. వారి డాక్టరు చెయ్యి జారింది. దీంతో ఉయ్యాల్లో తలకిందులుగా పడిపోయిందా పాప. 5 రోజుల తర్వాత చేసిన వైద్య పరీక్షల్లో ఆ పసిబిడ్డకు బ్రెయిన్ హేమరేజ్ ఉన్నట్లు తేలింది. అదే సమయంలో ఆ పాప తల్లిదండ్రులకు అసలు విషయం తెలిసింది. తమ కూతురు మోర్గాన్‌ను డాక్టరు పడేయడం వల్లే.. బ్రెయిన్ హేమరేజ్ వచ్చిందేమోనని వారు అనుమానిస్తున్నారు. దీనివల్ల ఆ పాప మెదడులో రక్తస్రావం జరిగి, మెదడు కణాలు చచ్చిపోతాయని వైద్యులు చెప్పారు. తమ కూతురికి ఈ వ్యాధి రావడానికి కారణం వైద్యుల నిర్లక్ష్యమేనని, పసిపాపను పట్టుకోవడం కూడా తెలియని ఆ వైద్యుడు.. కనీసం క్షమాపణ చెప్పలేదని పాప తల్లిదండ్రులు డెరిక్, మోనిక్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related posts