telugu navyamedia
సామాజిక

ఇంట్లో పూజించే గణేష్ విగ్రహాలు ఏ సైజ్ లో ఉండాలో తెలుసా?

హిందూ దేవతల్లో బాగా ప్రసిద్ధి చెందిన, ఎక్కువగా ఆరాధించబడే దేవుడు విఘ్నేశ్వరుడు. ఆయ‌న‌కు మొద‌ట‌గా పూజ చేసిన త‌రువాతే మిగ‌తా దేవుళ్ల‌కు పూజలు చేయ‌డం హిందూ సాంప్రదాయం. భారతదేశంలో వినాయకుడిని గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు, గణనాధుడు వంటి అనేక నామాలతో అర్చిస్తారు.

how to make ganesha with clay, clay ganesh making at home, clay se ganesh ji banana - YouTube

అయితే వినాయక చవితి వస్తుందంటే చాలు.. వాడవాడలా గణేష్ సంబ‌రాలు జ‌రుగుతుంటాయి. ఈ సారి ఎంత పెద్ద వినాయకుడి విగ్రహాన్ని పెడదామా అని ఆలోచిస్తుంటాయి. పక్క వాడలో పెట్టిన విగ్రహం కన్నా కొంచెం ఎత్తు ఎక్కువగా ఉన్న విగ్రహాన్నే పెట్టాలి.. అని పోటీలు పడి మరీ గణేష్ విగ్రహాలను పెడుతుంటారు. అయితే బయట బహిరంగ ప్రదేశాల్లో ఎంత పెద్ద విగ్రహాన్ని పెట్టినా ఫర్వాలేదు. కానీ ఇండ్లలో పెట్టుకునే గణేష్ విగ్రహాల సైజు విషయంలో మాత్రం కచ్చితంగా ఒక నియమాన్ని పాటించాల్సిందే. అదేమిటంటే…

సాధారణంగా బహిరంగ ప్రదేశాల్లో ఎంత పెద్ద విగ్రహాన్ని పెడితే అంత మంచిది. ఎందుకంటే అలాంటి ప్రదేశాల్లో పెద్ద ఎత్తున జనాలు ఉంటారు కనుక అందరూ స్వామిని చూసేందుకు పెద్ద విగ్రహం అయితేనే మంచిది. ఇక ఇండ్ల విషయానికి వస్తే.. ఇండ్లలో 18 ఇంచులు లేదా ఒకటిన్నర అడుగు కన్నా ఎత్తు ఎక్కువగా ఉన్న గణేష్ విగ్రహాన్ని ఇంట్లో పెట్టరాదు. అంతకన్నా తక్కువ ఎత్తులో ఉండే గణేష్ విగ్రహాన్నే ఇంట్లో పెట్టి పూజించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో పెట్టి పూజించే గణేష్ విగ్రహ విషయంలో కచ్చితంగా ఈ నియమాన్ని పాటించాలి.

Golkonda Handicrafts

అయితే ఇంట్లో ఎంత సైజులో ఉండే గణేష్ విగ్రహాన్ని పెట్టుకోవాలో తెలియని చాలా మంది పెద్ద విగ్రహాలను కూడా తెచ్చి ఇండ్లలో పెట్టి పూజిస్తుంటారు. అలా చేయరాదు. పెద్ద విగ్రహాలు కేవలం బహిరంగ ప్రదేశాల్లో పెట్టేందుకు మాత్రమే నిర్దేశించబడినవి. అందుకని ఇళ్ల‌లో గణేష్ విగ్రహాలను పెట్టాల్సి వస్తే పైన చెప్పిన ప్రకారం ఆ సైజు కన్నా తక్కువ సైజ్‌లో ఉండే విగ్రహాలను పెట్టుకుంటేనే అన్ని విధాలుగా శుభం కలుగుతుంది. లేదంటే అనుకున్న ఫలితం దక్కకపోవచ్చు..!

Related posts