telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

బ్యాంక్ అకౌంట్ తెరిచే ముందు ఈ చార్జీల గురించి తప్పక తెలుసుకోండి

Bank

బ్యాంక్ అకౌంట్ తెరవాలని భావిస్తున్నారా? అయితే మీరు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. బ్యాంక్ ఖాతా తెరవడం సులభమే. గతంలో మాదిరి కాకుండా ఇప్పుడు ఆన్‌లైన్‌లో కూడా బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయొచ్చు. బ్యాంక్‌కు కూడా వెళ్లాల్సిన పని లేదు. అయితే బ్యాంక్ అకౌంట్ తెరిచే ముందు బ్యాంకులు మీ వద్ద నుంచి చార్జీల రూపంలో ఎంత డబ్బులు వసూలు చేస్తాయో తెలుసుకోవడం మంచిది.

1. బ్యాంకులు ఏటీఎం చార్జీలు విధిస్తాయి. నిర్ణీత పరిమితి దాటిన తర్వాత ప్రతి లావాదేవీకి చార్జీలు చెల్లించుకోవాల్సిందే. ఉచిత ట్రాన్సాక్షన్ల లిమిట్ దాటిన తర్వాత ప్రతి లావాదేవీకి రూ.20 నుంచి రూ.50 చెల్లించుకోవాలి. చార్జీలు బ్యాంక్ ప్రాతిపదికన మారుతాయి.

2. క్యాష్ ట్రాన్సాక్షన్లకు కూడా చార్జీలు ఉన్నాయి. డిపాజిట్, విత్‌డ్రాయెల్స్‌కు చార్జీలు చెల్లించాలి. బ్యాంకులు ఉచిత లిమిట్ దాటిన తర్వాత చార్జీలు వసూలు చేస్తున్నాయి.

3. బ్యాంకులు డెబిట్ కార్డు ఉచితంగా ఇస్తాయి అని మనం భావిస్తుంటాం. కానీ వార్షిక ఫీజు రూపంలో బ్యాంకులు ప్రతి సంవత్సరం మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ చేసుకుంటాయి. రూ.99 నుంచి రూ.750 వరకు చార్జీలు పడతాయి.

4. డెబిట్ కార్డు ఎక్కువ కాలం అలాగే ఉండదు. పాడవుతుంది. లేదంటే విరిగిపోవచ్చు. లేదంటే ఎక్కడైనా జారిపోవచ్చు. ఇలాంటప్పుడు కొత్త డెబిట్ కార్డు తీసుకోవాలి. దీనికి చార్జీలు చెల్లించాలి. డెబిట్ కార్డ్ రిప్లేస్‌మెంట్ చార్జీలు రూ.200గా ఉన్నాయి.

5. బ్యాంక్ నుంచి మీ అకౌంట్ లావాదేవీలకు సంబంధించిన డూప్లికేట్ స్టేట్‌‌మెంట్ తీసుకోవాలంటే రూ.50 నుంచి రూ.100 ఖర్చు చేయాల్సిందే.

6. ఆన్‌లైన్‌లో మనీ ట్రాన్స్‌ఫర్ సేవలు ఉచితమే. కానీ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి ఎవరికైనా డబ్బులు పంపాలంటే మాత్రం చార్జీలు చెల్లించుకోవాలి. ఈ చార్జీలు రూ.1 దగ్గరి నుంచి రూ.50 వరకు ఉంటాయి.

7. బ్యాంక్ అకౌంట్ తెరిస్తే అందులో మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండాలి. ఒకవేళ మినిమమ్ బ్యాలెన్స్ కలిగి లేకపోతే చార్జీల బాదుడు మొదలవుతుంది.

8. బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి ఎస్ఎంఎస్ రూపంలో అలర్ట్ వస్తూ ఉంటాయి. బ్యాంకులు వీటికి కూడా చార్జీలను వసూలు చేస్తాయి.

Related posts