telugu navyamedia
ఆరోగ్యం

లోఫ్యాట్ డైట్ సంతానలేమికి కారణమవుతుందా?

Infertility

ఎప్పుడూ కూడా లోఫ్యాట్ డైట్ తింటూ, కొవ్వు పదార్ధాలు పూర్తిగా మానేసే మహిళల్లో సంతాన అవకాశాలు తక్కువని, మిగతా వారితో పోల్చితే 27 శాతము సంతాన అవకాశాలు తక్కువని ఇటీవల జరిగిన కొన్ని వైద్య అధ్యయనాల్లో వెల్లడైంది. సాధారణముగా కొవ్వు ఏమాత్రము లేని పదార్ధాలు తినేవారి శారీరక బరువు బాగా తక్కువగా ఉంటుంది. సరియైన ఓవులేటరీ ప్రక్రియ కోసము కనీసమాత్రపు శారీరక బరువు, ఫ్యాట్ అవసరము. అలాగే శరీరములో కొన్ని స్టెరాయిడ్స్ ఉత్పత్తికి కొలెస్టిరాల్ (cholesterol) అవసరము. లోఫ్యాట్ పదార్ధాలలో కొన్ని ఆర్టిఫీషియల్ పదార్ధాలు ఉండడము వలన సంతాన రాహిత్యానికి దారితీస్తాయి. ఏది ఏమైనా ఆహారములో మితముగా ఆరోగ్యవంతమైన కొవ్వు తప్పనిసరిగా ఉండాల్సిందే.

Related posts