telugu navyamedia
సినిమా వార్తలు

నర్సులకు సినిమా చూపిస్తున్న విజయ్‌కాంత్‌

డీఎండీకే పార్టీ అధినేత, కోలీవుడ్ న‌టుడు కెప్టెన్ విజయ్ కాంత్ చికిత్స కోసం దుబాయ్ కి వెళ్లిన విష‌యం తెలిసిందే. ప్రస్తుతం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న‌కు సంబంధించిన ప‌లు ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఆసుప‌త్రిలో ఆయ‌న న‌ర్సుల‌తో క‌లిసి ఫొటోలు దిగారు.తాజాగా విజయ్‌ కాంత్‌ తాను ఆరోగ్యంగానే ఉన్నానని ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. నర్సులతో కలిసి కాలక్షేపం చేస్తున్న ఫొటోను పోస్ట్‌ చేశారు. తాను నటించిన క్షత్రియన్ సినిమాను ఆసుప‌త్రిలో నర్సు లతో కలిసి చూసిన‌ట్లు చెప్పారు. కొంత కాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధప‌డుతోన్న విష‌యం తెలిసిందే.

గ‌తంలోనూ ఆయ‌న ప‌లు సార్లు ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు. అప్ప‌ట్లో అమెరికాలోనూ చికిత్స తీసుకుని తిరిగి వ‌చ్చారు. గత ఏడాది ఆయ‌న‌ కరోనా బారిన కూడా పడ్డారు. కరోనా సైడ్ ఎఫెక్టుల వల్ల ఆయ‌న‌ ఆరోగ్యం దెబ్బతిన్నట్టు కొన్ని నెలలుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

 

 

Related posts