telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

 దిశ ఘటనపై స్పందించిన డీకే అరుణ

dk-aruna

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనపై బీజేపీ నేత డీకే అరుణ స్పందించారు. అంతర్జాతీయస్థాయి నగరంలో ఇటువంటి ఘటనలు జరగడం దారుణమని అన్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇక్కడి నుంచి ట్వీట్లు చేయడం కాకుండా, ప్రధాని మోదీతో నేరుగా చర్చించాలని డిమాండ్ చేశారు.

ఆర్టీసీ మహిళా కార్మికులకే కాదు, మహిళా ఉద్యోగులందరికీ రాత్రివేళల్లో వెసులుబాటు కల్పించాలని అన్నారు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని సూచించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల కంటే వేగంగా నెలరోజుల్లోనే శిక్షలు పడేలా చూడాలని పేర్కొన్నారు. అత్యాచారాల పై కఠిన శిక్షలు పడేవరకు ఉద్యమాలు చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

Related posts