telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

దివ్య తేజస్విని కేసులో నిందితుడు నాగేంద్రకు 14 రోజుల రిమాండ్..

విజయవాడ దివ్య తేజస్విని హత్య కేసులో నిందితుడు నాగేంద్రకు 14 రోజుల రిమాండ్ విధించారు మొదటి చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఎస్‌.కమలాకర్ రెడ్డి.. కోర్టులో హాజరుపర్చడానికి ముందు ఈఎస్ఐ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు.. నాగేంద్రకు బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలు చేయించారు.. వాటితోపాటు కోవిడ్ పరీక్ష కూడా చేశారు. ఇదే సమయంలో.. తనకు ఉన్న గాయాల గురించి వైద్యులకు చెప్పారు నాగేంద్ర.. ఇక, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించడంతో.. నాగేంద్రబాబును మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు.. అక్కడ కోవిడ్‌ పరీక్షలు చేసిన అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశించారు..  మరోవైపు.. విజయవాడ దివ్య తేజస్విని హత్య కేసులో ఛార్జిషీట్‌ దాఖలు చేశారు దిశ పోలీసులు.  విజయవాడ కోర్టు కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. నిన్న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన  నాగేంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  23 రోజుల  క్రితం దివ్య తేజస్వినిని ఇంటికి వెళ్లి మరీ హత్య చేశాడు నాగేంద్ర.  తమ కూతురిని పొట్టనబెట్టుకున్న నాగేంద్రను ఉరి తీయాలని దివ్య తల్లిదండ్రులు కోరుతున్నారు.  తమ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేస్తుందనే నమ్మకం ఉందంటున్నారు దివ్య పేరెంట్స్.  నాగేంద్రను ఉరి తీయకుంటే మేమూ ఆత్మహత్య చేసుకుంటామని వ్యాఖ్యలు చేస్తున్నారు.

Related posts