telugu navyamedia
news political Telangana

ఈ నెల 24 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ!

bathukamma sarees

ఈ నెల 24 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం బతుకమ్మ చీరల పంపిణీ పై అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, జీహెచ్‌ఎంసి అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ జరగనున్ననేపథ్యంలో జీహెచ్‌ఎంసి పరిదిలోని ఆయా నియోజక వర్గాల్లో చీరల పంపిణీకి సంబంధించి మంత్రులు అధికారులతో చర్చించారు.

బతుకమ్మ చీరల పంపిణీ అంటేనే ఒక పండగలా జరగాలని ఏ ఇబ్బందులు రాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అర్హులైన అందరికీచీరలు అందేలా చూడాలన్నారు. ఈనెల 30వ తేదీ వరకూ చీరల పంపిణి జరుగుతుందని ఈసందర్భంగా మంత్రి తలసాని వెల్లడించారు .జీహెచ్‌ఎంసీకి 15 లక్షల 40 వేల చీరలు మంజూరయ్యాయనీ, జీహెచ్‌ఎంసీ, పౌరసరఫరాల శాఖ సమన్వయంతో చీరల పంపిణీ జరుగుతుందని మంత్రి అన్నారు. ఈ నెల 24 నుంచి 30 వరకు చీరల పంపిణీ ప్రక్రియ కొనసాగనుందని ఆయన తెలిపారు.

Related posts

హే భగవాన్ .. ఎన్నికలలో డబ్బులు పంచేందుకు కూడా .. టోకెన్ పద్దతి..!

vimala p

సీఎం జగన్‌కు రఘురామ కృష్ణరాజు మరో లేఖ

vimala p

పిల్లల చదువులకు ఇబ్బంది లేకుండా అమ్మఒడి: మంత్రి తానేటి

vimala p