telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరోనా ఎఫెక్ట్… “ది లయన్ కింగ్” యానిమేటర్ కన్నుమూత

Lion

హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ డిస్నీలో సుధీర్ఘకాలం పాటు యానిమేటర్‌గా పనిచేసిన ఆన్ సుల్లివన్ కరోనా వైరస్‌తో మృతిచెందారు. ఆమె వయసు ప్రస్తుతం 91 సంవత్సరాలు. కోవిడ్-19 లక్షణాలతో ఆమె ఈనెల 13న మృతిచెందినట్టు అమెరికన్ వార్తా సంస్థలు ఖరారు చేశాయి. ఆన్ సుల్లివన్ వుడ్‌లాండ్ హిల్స్‌లోని మోషన్ పిక్చర్స్ హోం ఫెసిలిటీ నివాసి. ఇదే ప్రాంతంలో మరో 13 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. 10 మందికి వారివారి నివాసాల్లోనే ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. మరో ముగ్గురుని హాస్పటిల్‌కు తరలించారు. మోషన్ పిక్చర్స్ హోం ఫెసిలిటీ (ఎంపీటీఎఫ్)లో ఎనిమిది మంది వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది. కాగా, సుల్లివన్ మృతి పట్ల ఎంపీటీఎఫ్ వాసులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎంపీటీఎఫ్ అధ్యక్షుడు, సీఈఓ బాబ్ బీచెర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా, డిస్నీ సంస్థ నిర్మించిన ప్రముఖ యానిమేషన్ చిత్రాలు ‘ది లయన్ కింగ్’, ‘ది లిటిల్ మెర్మైద్’, ‘లిలో’, ‘స్టిచ్’లలో సుల్లివన్ పనితనానికి మంచి గుర్తింపు వచ్చింది. డిస్నీలో ఇంక్-పెయింట్ ఆర్టిస్టుగా చేరిన సుల్లివన్.. ఆ తరవాత యానిమేటర్‌గా సుధీర్ఘకాలం పాటు సేవలు అందించారు. 2000 సంవత్సరంలో ఆమె డిస్నీ నుంచి రిటైర్ అయ్యారు.

Related posts