telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

దిశ హత్యకేసు : కుళ్లిపోతున్న నిందితుల మృతదేహాలు

Disha

దిశ హత్యకేసు నిందితుల మృతదేహాల అప్పగింతపై సస్పెన్స్ కొనసాగుతోంది. నలుగురి డెడ్‌బాడీలు గాంధీ ఆస్పత్రి మార్చురీలోనే ఉన్నాయి. రోజులు గడిచే కొద్ది కుళ్లిపోయే స్థితికి వస్తున్నాయి. వాస్తవానికి మృతదేహాలను ఈనెల 13 వరకే భద్రపరచాలని చెప్పారు.. ఈ గడువు ముగిసినా అప్పగింతపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. దీంతో గాంధీ ఆస్పత్రి వైద్యులు, అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఈ నాలుగు మృతదేహాలను ఎంబామింగ్ చేస్తే రెండు వారాల పాటూ భద్రపరచవచ్చని వైద్యులు చెబుతున్నారు. కానీ రీ పోస్ట్‌మార్టమ్‌కు అవకాశం ఉండదంటున్నారు. ఎంత కూలింగ్‌లో ఉంచినా.. ఉష్ణోగ్రతలు మెయింటైన్ చేసినా వారం మాత్రమే ఉంటాయని.. తర్వాత డెడ్‌బాడీలు కుళ్లిపోయే స్థితికి వస్తాయన్నారు. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండటంతో వైద్యులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. కోర్టు తీర్పు ఎప్పుడు వస్తుందో కూడా క్లారిటీ లేదు.. దీంతో గాంధీ ఆస్పత్రి వైద్యులు, అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థంకాని పరిస్థితి. అందుకే మృతదేహాలను ఢిల్లీకి తరలిస్తే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట. అక్కడైతే అధునాతన సౌకర్యాలతో ఉన్న మార్చురీలు ఉన్నాయంటున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి విన్నవించే ఆలోచనలో ఉన్నారట. దిశహత్య కేసు నిందితులు ఈ నెల 6న ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఎన్‌కౌంటర్‌పై విచారణకు ముగ్గురు రిటైర్డ్ జడ్జిలతో కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అలాగే డెడ్‌బాడీలను భద్రపరచాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

Related posts