telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

దీపావళికి .. మద్యం రేట్లపై కూడా .. డిస్కౌంట్లట.. బాబులు స్టాక్ చేసుకోవచ్చు..

Alcohol

దీపావళి పండగ సందర్భంగా విదేశీ స్కాచ్‌ ధరలు తగ్గించారు. దేశ రాజధాని ఢిల్లీలో స్కాచ్, వైన్ కోసం బారులు తీరనున్నారు. సోమవారం నుంచి తగ్గింపు అమల్లోకి వస్తోందని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. దేశ రాజధాని పరిసరాల్లో మాత్రమే విదేశీ స్కాచ్ ధరపై తగ్గింపు ఉంటుంది. ఉత్తర్ ప్రదేశ్‌లో మాత్రం తేడా ఉండదని.. ఎంఆర్పీ ప్రకారం ధరలు అందుబాటులో ఉంటాయని స్పష్టంచేశాయి. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్‌లో మాత్రం విదేశీ మద్యంపై తగ్గింపు ధరలు ఉంటాయి. చివాస్ రిగాల్, అబ్‌సోల్ట్, బాల్లాన్టినెస్ ధరలు తగ్గుతాయని పేర్కొన్నారు. ఢిల్లీ, గుర్గావ్‌లో విదేశీ మద్యం అక్రమ స్మగ్లింగ్‌ను నిరోధించేందుకే చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. దీనికితోడు దీపావళి కూడా కలిసొస్తుందని వారు భావిస్తున్నారు. మరోవైపు కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చినందున కూడా ఆఫర్ ప్రకటించడానికి కారణమైందనే వాదన కూడా వినిపిస్తోంది.

ఢిల్లీలో దీపావళి సందర్భంగా అబ్‌సోల్ట్ వోడ్కా రూ.1400కు విక్రయిస్తారు. 750 మిల్లీ లీటర్ల బాటిల్ అసలు ధర రూ.1800.. కాగా పండగ సందర్భంగా రూ.400 చొప్పున తగ్గించారు. అయితే ఇదే మందు బాటిల్ యూపీలో మాత్రం రూ.2450 ఉండటం విశేషం. బాలంటైన్స్ ఫైన్ మందు బాటిల్ రూ.1350కి విక్రయిస్తున్నారు. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లో మాత్రం రూ.2 వేలకు విక్రయిస్తున్నారు. కొత్త వైన్ షాపులకు టెండర్లు మొదలవడంతో.. ధరల తగ్గించామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. కానీ యూపీలో మాత్రం ధరల మార్పుల్లో తేడా ఉండదని తేల్చిచెప్పారు. సాధారణంగా ప్రతీ ఏటా ఏప్రిల్‌లో ఆల్కహాల్ ధరలు అమల్లోకి వస్తాయి. కానీ ఈసారి దేశ రాజధానిలో దీపావళి పండగ సందర్భంగా సోమవారం నుంచి తగ్గింపు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.

Related posts