telugu navyamedia
telugu cinema news

“డిస్కో రాజా” షూటింగ్ అప్డేట్

Disco-Raja

వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ తాజా చిత్రం రూపొందనుంది. ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి “డిస్కో రాజా” అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ రోజు రవితేజ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు చిత్రబృందం. బటర్ ఫ్లై ఆకారంలో డిస్కో అని ఇంగ్లీష్ లో రాజా అని తెలుగులో ఉన్న ఈ టైటిల్ పోస్టర్, టైటిల్ క్రింద ఉన్న రివైండ్… ఫార్వార్డ్… కిల్… అని ఉన్న లైన్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ మే 27 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు చిత్రబృందం. ఈ సినిమాకి ముందు రవితేజ చేసిన మూడు సినిమాలు వరుసగా పరాజయం పాలయ్యాయి. దీంతో ఈ సినిమాతోనైనా హిట్ సాధించాలని పట్టుదలతో ఉన్నాడు మాస్ రాజా రవితేజ. వైవిధ్యమైన కథాకథనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రమైనా రవితేజకు హిట్ ను అందిస్తుందేమో చూడాలి.

Related posts

“బిగ్ బాస్”లోకి మరో రెండు వైల్డ్ కార్డు ఎంట్రీస్

vimala p

ఆ సినిమా ఆగిపోవడం షాక్… కొన్ని తప్పులు చేశా : నాగార్జున

vimala p

నగ్నత్వానికి బానిసయ్యాను… హీరో వ్యాఖ్యలు

vimala p