telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“డిస్కోరాజా” విడుదల వాయిదా

Disco-Raja

విఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న తాజా చిత్రం “డిస్కో రాజా”. ఈ చిత్రంలో రవితేజ సరసన పాయ‌ల్ రాజ్‌పుత్‌, న‌భా న‌టేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మితమ‌వుతున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతుంది. ర‌వితేజ‌, ‌పాయ‌ల్ రాజ‌పుత్, నభా నటేష్, సునీల్, తాన్యా హోప్, బాబీ‌సింహా, వెన్నెల‌ కిషోర్, స‌త్య‌ త‌దిత‌రులు నటించారు. రిపబ్లిక్ డే మరియు మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు కానుకగా జనవరి 24న ‘డిస్కో రాజా’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ చిత్రంలో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ పార్ట్ ఎక్కువగా ఉండటంతో, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ అవుట్‌పుట్ కోసమే డిస్కోరాజాను డిసెంబర్ 20 నుంచి జనవరి 24కి వాయిదా వేస్తున్నట్లుగా నిర్మాత రామ్ తళ్లూరి, దర్శకుడు వి ఐ ఆనంద్ తెలిపారు. ఇదిలా ఉంటే నవంబర్ 18తో లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ ముగించి డిసెంబర్ మొదటి వారంలో డిస్కోరాజా టీజర్‌ను రిలీజ్ చేసేందుకు ఈ మూవీ టీం ప్లాన్ చేస్తుంది. ఈ చిత్రానికి ఎస్.ఎస్.తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Related posts