telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“డిస్కోరాజా” కలెక్షన్స్… ఓపెనింగ్స్ అదరగొట్టిన మాస్ మహారాజా

Disco-raja

మాస్ మహారాజా రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డిస్కోరాజా’ సినిమా నిన్న (జనవరి 24న) విడులైంది. ఈ సినిమాకు మంచి హైప్ రావడంతో ఓపెనింగ్స్ కూడా అదే రేంజ్‌లో ఉన్నాయి. మహేష్, బన్నీ అంతకాకపోయినా రవితేజ తన క్రేజ్, అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీసు వద్ద వసూళ్లు రాబడుతున్నారు. తొలిరోజు ‘డిస్కోరాజా’ ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.5 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని సమాచారం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని చాలా థియేటర్లలో ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ సినిమాలే ఆడుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘డిస్కోరాజా’కు చాలా తక్కువ థియేటర్లు ఇచ్చారని ఇండస్ట్రీ టాక్. నైజాంలో అయితే సింగిల్ స్క్రీన్ థియేటర్లు కేవలం 60 మాత్రమే ఇచ్చారని అంటున్నారు. థియేటర్లు పెద్దగా ఇవ్వనప్పటికీ ఈ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయంటే రవితేజ స్టామినా ఇప్పటికీ తగ్గలేదనే చెప్పొచ్చు. ‘డిస్కోరాజా’ తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.3 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా. నైజాంలోనే తొలిరోజు రూ.1.05 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. విడుదలకు ముందే ‘డిస్కోరాజా’ రూ.22 కోట్ల బిజినెస్ చేసిందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం. ‘డిస్కోరాజా’ సినిమాను దర్శకుడు వీఐ ఆనంద్ వినూత్నంగా తెరకెక్కించారు. ఒక రివేంజ్ స్టోరీకి సైన్స్ ఫిక్షన్‌ను జతచేసి కొత్త ప్రయోగం చేశారు. ఈ ప్రయోగానికి మాస్ రాజా ఒక మంచి రూపాన్ని తీసుకొచ్చారు. తన పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. వెన్నెల కిషోర్‌తో కలిసి చేసిన కామెడీ పాత రవితేజను గుర్తుకు తెచ్చింది. సునీల్ సరికొత్త పాత్రలో కనిపించి తన నటనలో వేరియేషన్స్‌ను చూపించారు.

Related posts