telugu navyamedia
telugu cinema news

విజయ్ దేవరకొండ కోసం పోటీ పడుతున్న ఆ ముగ్గురు ?

Vijay-Devarakonda

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ఇప్పుడు జోరు మీదున్నాడు. ఇటీవల విజయ్ నటించిన “టాక్సీవాలా” చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం “డియర్ కామ్రేడ్” చిత్రీకరణ దశలో ఉంది. ఆ తరువాత విజయ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అంతేకాదు మరో నాలుగు ప్రాజెక్టులకు సంబంధించిన అడ్వాన్సులు కూడా విజయ్ చేతిలో ఉన్నాయి. విజయ్ ఇంత బిజీగా ఉన్నప్పటికీ ఈ కమిట్మెంట్స్ అన్నీ పూర్తయ్యాక ఆయనతో సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో ముగ్గురు దర్శకుడు ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ ముగ్గురు దర్శకుల జాబితాలో పూరీ జగన్నాథ్, మారుతీ, గోపీచంద్ మలినేని ఉన్నారని తెలుస్తోంది. విజయ్ దేవరకొండకు ఇప్పటికే పూరీ కథను విన్పించగా… మారుతీ రెండుమూడు కథలతో విజయ్ కు నచ్చిన కథను ఓకే చేయడానికి సిద్ధంగా ఉన్నాడట. మరోవైపు గోపీచంద్ మలినేని కూడా ఒక కథపై బాగానే కసరత్తు చేస్తున్నాడట. దీన్నిబట్టి అర్థమవుతోంది విజయ్ క్రేజ్ ఎంతగా పెరిగిపోయిందో. మరి ఈ ముగ్గురిలో విజయ్ ముందుగా ఎవరి ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి.

Related posts

అల్లు శిరీష్ కు తండ్రిగా నాగబాబు

vimala p

దేశపౌరుల మన్ కీ బాత్… : ప్రకాష్ రాజ్

vimala p

మొక్క…

vimala p