telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలకృష్ణను పిలవాల్సింది… : దర్శకుడు తేజ

Teja

ప్రభుత్వంతో సినీ పెద్దల చర్చల విషయమై త‌న‌ని చ‌ర్చ‌ల‌కి ఆహ్వానించ‌క‌పోవ‌డంపై బాల‌కృష్ణ అసంతృప్తి వ్య‌క్తం చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్య‌ల‌పై నాగబాబు తీవ్రంగా మండిప‌డ్డాడు. దీనిపై టాలీవుడ్‌లో హాట్ హాట్ డిస్క‌ష‌న్స్ జ‌రిగాయి. తాజాగా ఇదే విష‌యంపై ద‌ర్శ‌కుడు తేజ స్పందించారు. “ఎవరున్నా లేకున్నా ఇండస్ట్రీ ఉంటుంది. మధ్యలో కొంతమంది వచ్చి ఇండస్ట్రీ నా వల్లే నడుస్తుందని అనుకుంటారు. కానీ ఇండస్ట్రీ శాశ్వతం. నాలాంటోళ్ళు ఎందరో వచ్చిపోతుంటారు. రామారావు గారు పోయినా ఇండస్ట్రీ నడిచింది. సావిత్రి గారు పోయినా ఇండస్ట్రీ నడిచింది. ఇలా ఎవ్వరూ లేకపోయినా ఇండస్ట్రీ నడుస్తోంది. బట్ ఇండస్ట్రీ తరఫున ఏ మీటింగ్ జరిగినా పెద్ద వాళ్లందరినీ పిలవాల్సిన అవసరం ఉంది. ఇటీవ‌ల జ‌రిగిన మీటింగ్ ఇండస్ట్రీ గురించి జరిగిందో లేదో నాకైతే తెలియదు గానీ.. ఒకవేళ ఇండస్ట్రీకి సంబంధించిన విషయమైతే ఖచ్చితంగా చిరంజీవి గారిని పిలవాలి అలాగే బాలకృష్ణ గారిని పిలవాలి. వాళ్ళే కాదు పరిశ్రమకు ఎవరైతే పిల్లర్‌లా ఉంటారో వారినందరినీ పిలవాలి. ఇండస్ట్రీ అనేది ఒక ఫ్యామిలీ… ఎవ్వరినీ చిన్నచూపు చూడకూడదు. ఎవ్వరూ తక్కువ కాదు, ఎవ్వరూ ఎక్కువ కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తేజ. కాకపోతే ఆ ఇష్యూ వెనకాల ఏం జరిగిందో తెలియకుండా దానిపై కామెంట్స్ చేయనని ఆయన స్ప‌ష్టం చేశారు.

Related posts