telugu navyamedia
సినిమా వార్తలు

మహేష్ కు, నాకు గొడవల్లేవ్… “నిజం” ఫ్లాప్ కావడానికి “ఒక్కడు” కారణం : తేజ

Teja

తేజ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం “నిజం”. 2003లో విడుదలైన ఈ చిత్రం తీవ్ర నిరాశనే మిగిల్చింది. కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా నిలబడలేకపోయింది కానీ మహేష్ బాబు నటనకు మాత్రం ప్రశంసలు దక్కాయి. ఆ పాత జ్ఞాపకాలని తేజ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. “నిజం” చాలా మంచి సినిమా. మహేష్ బాబు ఒక్కడు సినిమా ఎఫెక్ట్ నిజంపై పడడం వల్ల ప్లాప్ అయింది. “నిజం” కంటే ముందుగా ఒక్కడు విడుదలయింది. ఆ చిత్రంతో మహేష్ బాబు ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఒక్కడు చిత్రంలో మహేష్ ని చూసిన తర్వాత నిజం చిత్రంలో ఆడియన్స్ జీర్ణించుకోలేకపోయారు. “నిజం” ప్లాప్ కావడం వల్ల నాకు, మహేష్ కు గొడవలు జరిగాయని ఏవేవో వార్తలు వచ్చాయి. వాస్తవానికి మహేష్ కు, నాకు మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని తేజ వివరణ ఇచ్చారు.

Related posts