telugu navyamedia
సినిమా వార్తలు

“గ్యాంగ్ లీడర్”లో సుకుమార్ ఎంట్రీ…!

Gang-Leaser

నాని, విక్రమ్.కె.కుమార్ కాంబినేష‌న్‌లో తెరకెక్కిన చిత్రం “గ్యాంగ్ లీడ‌ర్”. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం) నిర్మించారు. ఇందులో ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ కీలక పాత్రను పోషించారు. ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఐదుగురు మహిళలకు నాని లీడర్‌గా, స్టోరీ రైటర్‌గా కనిపించబోతున్నాడు. ఇది ఒక రివేంజ్ డ్రామా. మరోసారి విక్ర‌మ్ కే కుమార్ త‌న మార్క్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచంద్రన్ అందించారు. ఈరోజు అంటే సెప్టెంబర్ 13న ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో నాని కామెడీ టైమింగ్ కు మంచి స్పందన వస్తోంది. తొలి రోజు ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను రూ.21కోట్లకు మార్కెట్ చేశారు. మొదటిరోజే దాదాపు నాలుగున్నర కోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో సుకుమార్ కనిపించాడు. ఈ సినిమాలో నాని రైటర్ పాత్ర చేసిన సంగతి తెలిసిందే. అతను హాలీవుడ్ సినిమాలను చూసి నవలలు రాస్తుంటాడు. ఊహించని విధంగా అతడి జీవితంలోకి ఐదుగురు ఆడవాళ్లు రావడం, వారి రివెంజ్ లో భాగమై.. ఆ జర్నీనే కథగా మలుస్తాడు. ఇది దర్శకుడైన సుకుమార్ కళ్లలో పడి.. దాని ఆధారంగా సినిమా తీయలనుకుంటాడు. ఇలా కొసమెరుపులా సినిమాలో సుకుమార్ ఎంట్రీ ఉంటుంది. తాను తెలుగు సినిమాలు తీస్తుంటానని సుక్కు పరిచయం చేసుకుంటే.. తాను తెలుగు సినిమాలు పెద్దగా చూడనని.. మీరెవరో నాకు తెలియదు అని నాని అంటాడు. థియేటర్ లో ఈ సీన్ బాగా పండింది. క్లైమాక్స్ లో వచ్చే ఈ సీన్ ఆడియన్స్ ని బాగా నవ్వించింది. ఇది ఇలా ఉండగా సుకుమార్ మరో సినిమాలో కూడా క్యామియో చేశాడు. అదే ‘వాల్మీకి’. ఈ సినిమాలో కూడా తన నిజజీవితంలో మాదిరి డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వనున్నాడు.

Related posts