telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రదీప్, సుధీర్ కలిసి కుట్ర చేశారు… అతనికి జనసేన అండ… దర్శకుడి వ్యాఖ్యలు

Pradeep

ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజుపై సంచలన ఆరోపణలు చేస్తూ కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు దర్శకుడు, నటుడు శ్రీరామోజు సునిశిత్. మేడ్చల్‌లోని కీసరకు చెందిన సునిశిత్… ప్రదీప్‌పై ఇటీవల బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గతంలో ప్రదీప్ ఓ అమ్మాయిని వేధించాడని దాంతో పోలీసులు రెండు రోజుల పాటు జైల్లో పెట్టారని షాకింగ్ ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని ప్రదీపే తనకు చెప్పాడని అన్నారు. జైలుకి వెళ్లి వచ్చిన అతను సినిమాల్లో ఎలా నటిస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రదీప్‌కు జనసేన సపోర్ట్ ఉందంటూ తాజాగా సునిశిత్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ‘‘చెక్ బౌన్స్ కేసులో కూడా సెలబ్రిటీలు జైలుకి వెళ్లి వస్తుంటారు. కానీ వాటిని వైట్ అఫెన్స్ కేసులు అంటారు. అంటే అవి నేరాలుగా పరిగణించరు. ఏపీ సీఎం కూడా జైలుకెళ్లి వచ్చారు. ఇప్పుడు ఆయన రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్‌ కూడా జైలుకెళ్లి వచ్చారు. కానీ సల్మాన్ లాంటి వాళ్లకు సీబీఎఫ్‌సీ రూల్స్ వేరుగా ఉంటాయి. గతంలో నటుడు సుమన్‌పైన కూడా ఓ కేసు పెట్టారు. ఆయన జైల్లో కూడా ఉన్నారు. ఆ తర్వాత ఐదేళ్ల పాటు ఒక్క సినిమా అయినా చేశారా? ప్రదీప్‌ మొదటినుంచి జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, నాగబాబు, చిరంజీవి సపోర్ట్ ప్రదీప్‌కు బాగా ఉంది. నాకు తెలిసి 2014, 2015 నుంచి ప్రదీప్ జనసేన పార్టీ కోసం పని చేస్తున్నారు. వీళ్ల అండ చూసుకుని సెన్సార్ బోర్డు రూల్స్‌కు వ్యతిరేకంగా ప్రదీప్ వ్యవహరిస్తున్నాడని నాకు బాగా అర్ధమవుతోంది. నేను ప్రదీప్‌తో సుడిగాలి సుధీర్‌తో కొన్ని షోలకు యాంకరింగ్ చేశాను. నాకు ఇద్దరూ మంచి ఫ్రెండ్సే. కానీ వారిద్దరూ నాపై కుట్ర పన్నారు. నేను సినిమా ఇండస్ట్రీలో ఎందుకు ఉన్నట్లు అంటూ ‘మా’ అసోసియేషన్‌లో నాపై ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో శివాజీ రాజా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ తర్వాత నరేష్ అధ్యక్షుడు అయ్యారు. ఈ విషయం గురించి నేను నరేష్‌తో మాట్లాడితే తర్వాత చూద్దాం అన్నారు. ఒకప్పుడు నేను ప్రదీప్ ఫ్రెండ్స్. తన వ్యక్తిగత విషయాలన్నీ నాకు చెప్పాడు. ఇప్పుడు మా ఇద్దరికీ మాటల్లేవు. అందుకే అతని తప్పులను బయటపెడుతున్నాను. ఒకవేళ ప్రదీప్ హీరోగా వస్తున్నాడని అతన్ని అణిచివేయడానికి నేను అబద్ధాలు చెబుతున్నాను అని మీకు అనిపిస్తే మీరు నాపై కేసు పెట్టుకోండి. నాకేం అభ్యంతరం లేదు. చాలా మంది నేను పబ్లిసిటీ కోసం ప్రదీప్‌పై కేసు పెట్టానని అనుకుంటున్నారు. నాకు అలాంటి ఆశ ఏమీ లేదు. కావాలంటే మీరు నా ఫొటోను కానీ పేరును కానీ ఎక్కడా వాడొద్దు. ఒకవేళ నేను ప్రదీప్‌పై పెట్టిన కేసు కరెక్ట్ అయితే ఆయన కచ్చితంగా కోర్టుకు రావాల్సిందే. లేకపోతే వాళ్లే కేసు కొట్టేస్తారు” అంటూ చెప్పుకొచ్చారు.

Related posts