telugu navyamedia
telugu cinema news

“3.0”పై స్పష్టతనిచ్చిన శంకర్

Shankar

ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన “2 పాయింట్ 0” చిత్రం హిట్ టాక్ తో మంచి కలెక్షన్లతో దూసుకెళ్తోంది. దాదాపు 500 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రంలో రజినీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం గతంలో శంకర్ రూపొందించిన “రోబో”కు సిక్వెల్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే “2 పాయింట్ 0” చిత్రం చివర్లో చిట్టి స్థానంలో కుట్టి (తెలుగులో చిన్ని) అనే సూపర్ హ్యూమనాయిడ్ రోబో ఉంటుందని హింటిస్తూ సినిమాను ముగించారు శంకర్. దీంతో “3.0”పై పలు రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా దర్శకుడు శంకర్ ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చారు.

ఏదో తీయాలి కదా అని సీక్వెల్ తీయము. సరైన కథ దొరకాలి… సరైన స్క్రిప్ట్ దొరకాలి… నా సినిమాలు ఎప్పుడూ ఓపెన్ ఎండింగ్ గా ఉంటాయి. తర్వాత తీయబోయే సీక్వెల్ కు నటీనటులు కూడా అందుబాటులోనే ఉంటారు. ఒకవేళ సీక్వెల్ కొత్త టెక్నాలజీని డిమాండ్ చేస్తే… దాని ప్రకారమే చేసుకుంటూ వెళ్తాము” అంటూ శంకర్ వెల్లడించారు. 3.0 కూడా ఖచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు.

Related posts

ప్రేమ నిరీక్షణ…

vimala p

కోరిక తీరిస్తే గంటకు 2 లక్షలు… హీరోయిన్ కు ఆఫర్

vimala p

300 కోట్లతో విక్రమ్ “మహావీర్ కర్ణ”

vimala p