telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విజయ్ తో .. శంకర్ చిత్రం… వైరల్ ..

director sankar with vijay movie soon

కోలీవుడ్ మీడియాలో శంకర్ డైరెక్షన్ లో విజయ్ మూవీ రాబోతుందంటూ.. వార్తలు తెగ వచ్చేస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ అట్లీ డైరెక్షన్లో “బిగిల్” అనే చిత్రం చేస్తున్నాడు. రీసెంట్ గా ఈ మూవీ ఫస్ట్ లుక్ వచ్చి అభిమానులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాదు అంచనాలను విపరీతంగా పెంచేసింది. ఈ చిత్రం తర్వాత విజయ్ లోగేష్ భాగ్యరాజ్ డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నాడు. దీని తర్వాత శంకర్ డైరెక్షన్లో తన 65 వ చిత్రం చేయనున్నాడని అంటున్నారు.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించిన చర్చలు వీరి మధ్య జరుగుతున్నాయంటున్నారు. దీనిపైన ఇంత వరకు ఎటువంటి అధికారక సమాచారం లేనప్పటికీ కోలీవుడ్ లో మాత్రం వీరిద్దరి కాంబో లో సినిమా ఫిక్స్ అయ్యిందని గట్టిగా ప్రచారం చేస్తున్నాయి. శంకర్ కొన్ని రోజుల క్రితం కమల్ హాసన్ తో మొదలుపెట్టిన భారీ చిత్రం “భారతీయుడు2” వివాదాల వలన ఆగిపోయిన నేపథ్యంలో విజయ్ తో సినిమా చేయాలని శంకర్ ఫిక్స్ అయినట్లు అంటున్నారు. ఇందులో ఎంత నిజం ఉందొ, శంకర్ గొంతు విప్పితేగాని తెలియదు!!

Related posts