telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పోలీసుల తీరుపై వర్మ సెటైర్

రామ్ గోపాల్ వర్మ తాజాగా ఏపీలోని విజయనగరం పార్వతీపురం కరోనాపై అవగాహన పెంచుతూ పోలీసులు రాములో రాములా పాటకు డాన్స్ చేస్తూ ఉన్న వీడియోను రిలీజ్ చేశారు. ఇది కాస్తా ఆర్జీవీ దృష్టికి చేరడంతో.. ఒక హైప్ క్రియేట్ అయ్యేలా షాకింగ్ ట్వీట్ చేశారు. ‘సమాజానికి దిశా.. నిర్దేశం చేసే పోలీసులు ఒక పద్దతి ప్రకారం ఉండాలి. సమాజంలో ప్రజలకు ఆదర్శంగా నిలవాలి. కానీ సంపూర్ణేష్ బాబులా కామెడీ చేయకూడదంటూ వర్మ.. పోలీసులు డాన్స్ చేసే వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అలాగే హీరో రజనీకాంత్‌ను ఉద్ధేశించి, కరోనాను ఉద్దేశించి మరో రెండు, మూడు ట్వీట్లు చేశారు ఆర్జీవీ. కరోనాకు పెద్ద చిన్నా అనే తేడా లేదని.. ఈ వైరస్‌కి బయపడి దేవాలయాలు, మసీదులు, చర్చిలు కూడా మూసేశారన్నారు. కరోనాతో మామూలు ప్రజలతో పాటు దేవుళ్లకు కూడా పెద్ద గుణపాఠం నేర్పిందంటూ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.

Related posts