telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హీరో, డైరెక్టర్ లిప్ లాక్… పిక్ వైరల్

Ravikumar

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన రొమాంటిక్ డ్రామా ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ ఎట్టకేలకు గురువారం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. రవికాంత్ పెరెపు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని వాడ్నికట్టి హీరోయిన్లుగా నటించారు. ముక్కోణపు ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాను రానా దగ్గుబాటి సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్, సంజయ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. అప్పుడెప్పుడే మొదలైన ఈ సినిమా మొత్తానికి గురువారం విడుదలైంది. ఇదిలా ఉంటే, ఈ సినిమాకు సంబంధించి ఒక ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి కారణం లిప్ లాక్. ఇదేదో హీరోహీరోయిన్ల మధ్య లిప్ లాక్ అనుకునేరు. దర్శకుడు, హీరో మధ్య లిప్ లాక్. ఆ ఫొటోలో దర్శకుడు రవికాంత్ పెరెపు, హీరో సిద్ధు జొన్నలగడ్డ లిప్ లాక్ పెట్టుకుంటున్నారు. ఈ ఫొటో చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. అయితే, ఇది సినిమా ప్రచారం కోసం వాడుతోన్న ట్రిక్ అని కొంత మంది విమర్శిస్తున్నారు. ఏదేమైనా ఈ ఫొటో ఇప్పుడు హాట్ టాపిక్.

Related posts