telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చిరంజీవితో సినిమా ఆగిపోవడానికి అసలైన కారణం… సీక్రెట్స్ వెల్లడించిన వర్మ

RGV

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మెగా ఫ్యామిలీతో ఉన్న విభేదాలపై క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు గతంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లతో సినిమా ఎందుకు వదులు కోవాల్సి వచ్చిందో కూడా వివరించారు. పవన్ కళ్యాణ్, చిరంజీవితో సినిమాల విషయమై ఆయన మాట్లాడుతూ “ఇది పాతికేళ్ల నాటి విషయం… అప్పటికి పవన్ కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇవ్వలేదు. అప్పట్లో నేను ఆయనకు ఒక కథ వినిపించా.. ఆ కథలో ఆయన హీరో కాదు.. కీలకమైన రోల్. అయితే హీరోగా ఎంట్రీ ఇచ్చే ఆలోచన ఉన్న పవన్ కళ్యాణ్ ఆ పాత్ర చేయనన్నారు. అది ఆయన ఇష్టం. ఇది నాకే కాదు ఆయనకి కూడా గుర్తుండకపోవచ్చు. అప్పుడే అనిపించింది పవన్ కళ్యాణ్ జడ్జిమెంట్ రాంగ్ కాదు అని. ఇక అప్పట్లో ఊర్మిళ, చిరంజీవితో సినిమా తీయాలని అనుకున్నా… కథ ఆయనకు నచ్చింది… నా మిస్టేక్స్ వల్ల ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. చిరంజీవి గారు చేసిన తప్పు లేదు.. ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి కారణం.. ఆయన నా డైరెక్షన్‌లో వేలు పెట్టారని రూమర్స్ వచ్చాయి. అవి నిజం కాదు. అదంతా తప్పుడు ప్రచారం.. చిరంజీవి ప్రొఫెషనల్ యాక్టర్. నా సినిమానే కాదు.. ఆయన ఎవరి సినిమాలోనూ వేలు పెట్టరు. నటుడిగా పూర్తి న్యాయం చేయడానికి చూస్తారు. సినిమా ఆగిపోవడానికి రీజన్ అది కాదు.. నా పర్సనల్ రీజన్. ఇందులో చిరంజీవి గారి తప్పు లేదు” అంటూ అసలు విషయం చెప్పుకొచ్చారు రామ్ గోపాల్ వర్మ. అయితే ఇన్ని రోజులు విమర్శలు గుప్పించిన ఇప్పుడు ఇలా రూట్ మార్చాడేంటొ అనుకుంటున్నారు నెటిజన్లు.

Related posts