telugu navyamedia
telugu cinema news trending

శ్రీదేవి డేట్స్ ఇస్తే పోర్న్ మూవీ చేస్తారా ?… యాంకర్ ప్రశ్నకు వర్మ ఘాటు రిప్లై

RGV

రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య ఆయన తీసిన కళాఖండం ‘నగ్నం’ అనే లఘుచిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా పాపులర్ ఛానల్స్‌కి మాత్రమే కాకుండా అన్ని యూట్యూబ్ ఛానల్స్‌కి ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే ఈ ఇంటర్వ్యూలలో వర్మ చెప్పిన బోల్డ్ ఆన్సర్ వైరల్ అవుతున్నాయి. అయితే ఇంటర్వ్యూకి ఛాన్స్ ఇచ్చారు కదా అని ఓ యూట్యూబ్ ఛానల్ యాంకర్ బోల్డ్ డైరెక్టర్ వర్మకే బోల్డ్ ప్రశ్న వేసింది. అందులోనూ ఆయన ఎంతో ఆరాధించే శ్రీదేవి గురించి ప్రశ్న కావడంతో చిర్రెత్తుకొచ్చిందాయనకు. మమతా రెడ్డి అనే కొత్త యాంకర్ తన తొలి ఇంటర్వ్యూను డైరెక్ట్‌గా వర్మతోనే చేసింది. మొదట ‘కరోనా’ నేపథ్యంలో వర్మ తీస్తున్న సినిమాపై ప్రశ్నలు అడిగిన యాంకర్.. మెల్లగా శ్రీదేవి టాపిక్‌కి వెళ్లింది.. ‘మీరు పోర్న్ సినిమాలు ఎక్కువగా తీస్తుంటారు కదా.. అలాగే మీకు శ్రీదేవి గారు అంటే చాలా ఇష్టం.. ఇది అందరికీ తెలిసిన విషయం.. ఒకవేళ శ్రీదేవి గారే ఉండి ఉంటే.. ఆవిడ మీకు డేట్స్ ఇస్తే.. పోర్న్ టైప్ మూవీ చేస్తారా’? అని పిచ్చి ప్రశ్న వేసింది. యాంకర్ ప్రశ్నకు ఫోన్ పక్కన పెట్టి స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చారు వర్మ. ‘నా లాస్ట్ నాలుగు చిత్రాలు మీరు చూస్తే.. లక్ష్మీస్ ఎన్టీఆర్, కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, క్లైమాక్స్, కరోనా.. వీటిలో పోర్న్ ఎక్కడ ఉందో చెప్పండి.. నేను ఎక్కువగా పోర్న్ సినిమాలు చేస్తున్నా అనడం కరెక్ట్ కాదు.. ప్రతి సినిమా నేపథ్యాన్ని బట్టి పాత్రలు ఉంటాయి. ఎక్కువగా పోర్న్ చేస్తా అనే మాట తప్పు.. ఏ సినిమాలో పోర్న్ ఉందో తెలుసుకుని ప్రశ్న వేయాలి.. ఇలాంటి స్టుపిడ్ క్వచ్ఛన్ అడిగితే నా ఆన్సర్ ఇలాగే ఉంటుంది’ అంటూ యాంకర్‌కి చుక్కలు చూపించారు వర్మ. ఈ ఇంటర్వ్యూపై కామెంట్స్ చేస్తూ యాంకర్‌ని ట్రోల్ చేస్తున్నారు. ఇక శ్రీదేవి అభిమానులు అయితే యాంకర్‌ని బండ బూతులు తిడుతున్నారు.

Related posts

సొంత కిడ్స్ ఫ్యాషన్ లైన్ ను లాంచ్ చేయనున్న మంచు ట్విన్స్

vimala p

బుల్లితెర పై .. సందడి చేయనున్న… నటి సమంత…

vimala p

కరోనాకు ఆ ఒక్క టాబ్లెట్ చాలు… భారతీయ శాస్త్రవేత్త గగన్‌దీప్‌ కాంగ్‌

vimala p