telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మహేష్ బాబుతో రాజమౌళి సినిమా పట్టాలెక్కేది అప్పుడేనా ?

Rajamouli-with-MB

దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం “ఆర్ఆర్ఆర్” సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయింది. ఇదిలా ఉండగా… రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తానని అనౌన్స్ చేసి చాలా కాలం అయ్యింది. మహేష్ బాబుతో సినిమా చేస్తానని రాజమౌళి చెప్పడం, ఆయనకు తగినటువంటి కథ తన వద్ద సిద్ధంగా ఉందని ప్రముఖ కథా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా ఓ సందర్భంలో చెప్పుకు రావడంతో ఈ సినిమా గురించి సూపర్ స్టార్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ ఏడాదిలో ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ పూర్తి అయ్యే పరిస్తితి కనిపించడం లేదు. దాంతో సినిమాను వచ్చే ఏడాది చివర్లో విడుదల చేసే అవకాశం ఉంది. మహేష్ బాబు సినిమాను మొదలు పెట్టే విషయంలో వచ్చే ఏడాది చివరి వరకు క్లారిటి వచ్చే అవకాశం ఉంది. అంటే సినిమాను 2022 సంవత్సరంలో ప్రారంభించే అవకాశం ఉంది. జకన్న తన ప్రతి సినిమాను కనీసం రెండు సంవత్సరాలు తీస్తాడు. మహేష్ బాబుతో సినిమాను కుడా తక్కువలో తక్కువ రెండు ఏళ్ళు అయినా తెరకేక్కిస్తాడు. అందుకే సినిమా విడుదలకు కనీసం నాలుగు సంవత్సరాలు అయినా పట్టే అవకాశం ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది.

Related posts