telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సినిమా ధియేటర్లలోనే ‘సినిమా’ తట్టుకుని నిలబడుతుంది : వైవిఎస్ చౌద‌రి

YVS

క‌రోనా దెబ్బ‌కి అన్ని పరిశ్రమలతో పాటుగా సినిమా ప‌రిశ్ర‌మ కూడా అతలాకుతలమైంది. క‌రోనా ఎఫెక్ట్ వ‌ల‌న ఒకవైపు సినిమా షూటింగులు ఆగిపోవడం, మరోవైపు విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలకు బ్రేక్ పడడంతో ఇన్నాళ్ళు థియేటర్స్‌లో విడుద‌లైన సినిమాలు ఓటీటీ బాట ప‌డుతున్నాయి. దీంతో థియేట‌ర్ ఓన‌ర్స్‌, డిస్ట్రిబ్యూట‌ర్స్ గ‌గ్గోలు పెడుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత వైవిఎస్ చౌద‌రి “సినిమా ధియేటర్లలోనే ‘సినిమా’ తట్టుకుని నిలబడింది, నిలబడుతుంది” అంటూ ఓ సుదీర్ఘమైన పోస్ట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రేపు త‌న బ‌ర్త్‌డే కావ‌డంతో ఈ సంద‌ర్భంగా ఓ ప్ర‌క‌ట‌న‌లో అడ‌వి కాచిన వెన్నెల‌లా ఒంట‌రిత‌నాన్ని అనుభ‌విస్తున్న సినిమా ప‌రిశ్ర‌మ పూర్వ‌పు వైభ‌వాన్ని పొందుతుంని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

Related posts