telugu navyamedia
సినిమా వార్తలు

“కబాలి” దర్శకుడి అరెస్ట్ తప్పదా ?

Ranjith

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో ‘కబాలి’, ‘కాలా’ వంటి సినిమాలను రూపొందించిన దర్శకుడు పా.రంజిత్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఇటీవల తంజావూరు జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ దళిత సభలో పాల్గొన్న ఆయన రాజ రాజ చోళుడు గురించి నెగెటివ్ గా మాట్లాడారు. తమిళ జనాల్లో ఎక్కువ శాతం మంది చోళ చక్రవర్తిని గొప్ప వ్యక్తిగా, దేవుడిగా భావిస్తున్నారు. అయితే రాజ చోళుడు అందరూ అనుకుంటున్నట్లు మంచి వాడు కాదని, చోళుడు తన పాలనలో తక్కువ కులాల వారి భూములను లాక్కున్నారని, దాదాపు నాలుగు వందల మందిని దేవదాసీలుగా మార్చారని, ఆయన పాలనలో చీకటి కోణాలు చాలా ఉన్నాయని, చరిత్రను లోతుగా అధ్యయనం చేస్తే అతడి గురించి నిజాలు తెలుస్తాయని పా.రంజిత్ అన్నారు. రంజిత్ చేసిన ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంజిత్ పై పలు కేసులు నమోదయ్యాయి. దీంతో రంజిత్ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించగా కోర్టు తిరస్కరించింది. పోలీసులు పా.రంజిత్ ని పిలిపించి తను చేసిన వ్యాఖ్యలపై వివరణ అడగనున్నారు. రంజిత్ సమాధానంతో వారు సంతృప్తి చెందకుంటే అరెస్ట్ చేస్తారనే టాక్ నడుస్తోంది.

Related posts