telugu navyamedia
సినిమా వార్తలు

ప్రియా వారియర్ కు అసలు యాక్టింగ్ రాదు… “లవర్స్ డే” దర్శకుడి వ్యాఖ్యలు

Priya Prakash Varrier images

“దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి” అనే నానుడి ఇండస్ట్రీలోని నటీనటులకు బాగా సరిపోతుంది. క్రేజ్ ఉన్నప్పుడే నటీనటులు మంచి సినిమాలను ఎంచుకుంటూ తమకున్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలి. లేదంటే ప్రియా ప్రకాష్ వారియర్ లా చిక్కులు ఎదుర్కోక తప్పదు. “ఒరు అదార్ లవ్” సినిమా విడుదలకు ముందు ప్రియా ప్రకాష్ వారియర్ కు దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ వచ్చింది. ఇంకా సినిమా కూడా విడుదల కాకముందే దాదాపు అన్ని భాషల నుంచి ఆమెకు ఆఫర్ల వెల్లువలా వచ్చి పడ్డాయి. కానీ వాటన్నింటినీ వదిలేసింది ప్రియా. ఇప్పుడు సినిమా పరాజయం పాలవ్వడంతో ప్రియా పరిస్థితి తారుమారైంది. సినిమాలోని తన సహనటి నూరిన్ నుంచి విమర్శలను ఎదుర్కొంది ప్రియా. ఇప్పుడు దర్శకుడు ఒమర్ లులు తాజాగా వ్యాఖ్యలు చేశారు.

“షూటింగు మధ్యలో ఉండగానే ప్రియా వారియర్ కి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. దాంతో ఆమె నాకు కనీస గౌరవం కూడా ఇవ్వడం మానేసింది. ఆమె క్రేజ్ మేరకు, నిర్మాతల ఒత్తిడి మేరకు ఆమెకి ప్రాధాన్యతనిస్తూ కథలో మార్పులు చేర్పులు చేయవలసి వచ్చింది. దాంతో సినిమా పరాజయం పాలైంది. జరిగిన దానికి ఆమే కారకురాలు. అంతేకాదు ప్రియాకు విపరీతమైన క్రేజ్ రావడంతో కనీసం సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొనలేదు. ప్రియాప్రకాష్ కి నటన రాదు. ఆమెతో హావభావాలు పలికించలేకపోయాను. కాసేపు కనబడే పాత్ర కాబట్టి తీసుకున్నానే కానీ హీరోయిన్ వేషమైతే అసలు ఇచ్చేవాడిని కాదు” అంటూ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.




Related posts