telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విశాల్ తో గొడవ… స్పందించిన దర్శకుడు

Vishal

హీరో విశాల్, దర్శకుడు మిష్కిన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన `డిటెక్టివ్` సినిమా తమిళంలోనే కాదు తెలుగులోనూ విజయవంతమైంది. దీంతో ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేశారు. షూటింగ్ కూడా ప్రారంభించారు. అయితే సగంలో ఉండగా విశాల్‌కు, మిష్కిన్‌కు మధ్య విభేదాలు తలెత్తాయి. మిష్కిన్ ఆ సినిమా నుంచి తప్పుకున్నారు. దీంతో దర్శకత్వ బాధ్యతలను కూడా విశాల్ నిర్వర్తిస్తున్నాడు. విశాల్‌తో గొడవ గురించి దర్శకుడు మిష్కిన్ తాజాగా మాట్లాడారు. “డిటెక్టివ్-2` సమయంలో మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఒకరిపై మరొకరికి కోపం వచ్చింది. అలా మేం దూరమయ్యాం. విశాల్‌ను చాలా మిస్సవుతున్నా. అతను నాకు సోదరుడులాంటివాడు. మంచి ప్రతిభ గల నటుడు. అతను నాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. అతనిపై నాకు చాలా ప్రేమ ఉంద`ని మిష్కిన్ చెప్పారు.

Related posts