telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కోహ్లీ నిన్ను తల్లిని మాత్రమే చేశాడు… అనుష్క శర్మపై మహిళా జర్నలిస్ట్ షాకింగ్ కామెంట్

Anushka

విరుష్క జోడీ తల్లిదండ్రులు కాబోతుండడంతో తమ తమ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు అందుకుంది. కాకపోతే రీసెంట్‌గా తన గర్భాన్ని చూసి మురిసిపోతూ అనుష్క శర్మ పెట్టిన పోస్ట్‌పై ఓ మహిళా జర్నలిస్ట్ వ్యగ్యంగా కామెంట్ చేయడం షాక్‌కి గురిచేసింది. మాతృత్వ గొప్పతనాన్ని తెలుపుతూ ”ఈ ప్రపంచంలో ఇంతకంటే మధురమైంది మరొకటి లేదు” అని అనుష్క చేసిన ఎమోషనల్ కామెంట్‌పై సెటైర్ వేసింది మహిళా జర్నలిస్ట్. “అనుష్క గారు మిమ్మల్ని విరాట్ కోహ్లీ తల్లిని మాత్రమే చేశారు. ఇంగ్లాండ్‌కి మహారాణిని చేయలేదు. మరీ అంతలా సంబరపడాల్సిన అవసరం లేదండీ” అంటూ ఆ మహిళా జర్నలిస్ట్ కామెంట్ చేయగా… దాన్ని చూసి కోపంతో ఊగిపోయారు డైరెక్టర్ మారుతి. ”ఒక రాజ్యానికి రాణి కావడం కంటే బిడ్డకు తల్లి కావడమే మహిళకు గొప్ప విషయం. అవును ప్రతి మహిళ ఒక మహారాణే. సంతోషంతో నిండిన ప్రతి ఇల్లు కూడా గొప్ప సామ్రాజ్యమే. అనుష్క సెలబ్రిటీ కావడం కంటే ముందు ఓ సాధారణ మహిళ. తల్లి కాబోతున్న క్షణాలను ఆస్వాదించే హక్కు ఆమెకుంది. ఒక మహిళ జర్నలిస్ట్ అయిన మీరు ఇలాంటి కామెంట్స్ చేయడం బాధగా అనిపిస్తోంది” అంటూ చురకలంటిచారు మారుతి.

Related posts