telugu navyamedia
telugu cinema news trending

రవితేజ “క్రాక్”పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Crack

మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న క్రాక్ మూవీ షూటింగ్ పూర్తయింది. అయితే తాజా పరిణామాల దృష్ట్యా ‘క్రాక్’ ఓటీటీ వైపే చూస్తోందటూ వార్తలు వస్తుండడంతో… సోషల్ మీడియాలో ద్వారా స్పందించిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా థియేటర్స్ లోనే విడుదలవుతుందని.. ఓటీటీలో వచ్చే ఛాన్స్ లేదని అన్నారు. గతంలో రవితేజతో ”డాన్‌ శీను, బలుపు” లాంటి సూపర్‌ హిట్ సినిమాలను తెరకెక్కించిన గోపీచంద్ మ‌లినేని.. ‘క్రాక్’ రూపంలో మరో హిట్ సినిమా లైన్‌లో పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందిస్తున్నారని తెలిసింది. సరస్వతి ఫిలిం డివిజన్‌ బ్యానర్‌లో బి. మధు నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో రవితేజ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా నటిస్తుండగా, ఆయన సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సముద్రఖని, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Related posts

భారత వీసాల … తిరస్కరణ.. సమాచారం ఇవ్వట్లేదట..

vimala p

లిబియా కు .. భారతీయుల రాకపోకలు నిషేధం.. !

vimala p

“హిప్పీ” మా వ్యూ

vimala p