telugu navyamedia
సినిమా వార్తలు

దర్శకుడి పుట్టినరోజు వేడుకల్లో ఒకేచోట చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్

Tollywood

టాలీవుడ్ సీనియర్ హీరోలూ, స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్ ముగ్గురూ ఒకే వేడుకలో కన్పించి అభిమానులకు కనువిందు చేశారు. సోమవారం రాత్రి ప్రముఖ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి 70వ జన్మదిన వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ తో పాటు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, ఎమ్మెస్ రాజు, దిల్‌ రాజు, అనిల్ సుంకర, దర్శకులు బి. గోపాల్, డాక్టర్ కేఎల్ నారాయణ, చంటి అడ్డాల, ఎస్ గోపాల్‌రెడ్డి, సంగీతదర్శకుడు కోటి తదితరులు పాల్గొన్నారు. టాలీవుడ్ లో స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్ ముగ్గురూ ఓకే చోట కనిపించడం చాలా అరుదు. దాదాపు ఏడాదిన్నర క్రితం జరిగిన టాలీవుడ్ నటీ నటుల క్రికెట్ పోటీల్లో కనిపించిన తరువాత, వీరు ముగ్గురూ కలిసి ఒకేచోట మరోసారి కనిపించలేదు. వీరు ముగ్గురికీ సూపర్ హిట్ చిత్రాలను ఇచ్చిన కోదండరామిరెడ్డి 70వ జన్మదిన వేడుకలకు ముగ్గురూ హాజరై, కోదండరామిరెడ్డికి కేక్ తినిపించి, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ముగ్గురు హీరోలూ కలిసున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts