telugu navyamedia
telugu cinema news trending

గోఎయిర్ విమాన సిబ్బందిపై బిగ్ బాస్ బ్యూటీ ఫైర్

Deepika

ప్రముఖ టీవీ నటి, బిగ్ బాస్ 12 విజేత దీపికా కాకర్ ప్రస్తుతం టెలివిజన్ షో ‘కహాన్ హమ్ కహాన్ తుమ్’ లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అయితే తాజాగా ఈ బ్యూటీ గోఎయిర్ విమాన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీపికా కాకర్ ఆదివారం తన భర్త షోయబ్ ఇబ్రహీం, వదిన సబాతో కలిసి ముంబై నుంచి లక్నోకు వెళ్లేందుకు గో ఎయిర్ విమానం ఎక్కారు. విమానం ఎక్కాక బయలు దేరే సమయం అయిపోయినా గో ఎయిర్ విమాన సిబ్బంది ఆలస్యానికి కారణం ప్రకటించలేదు. దీంతో విమానయాన సిబ్బంది నిర్లక్ష్య వ్యవహారశైలిపై దీపికా కాకర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి సుదీర్ఘ నోట్‌ పెట్టారు. “వావ్ గో ఎయిర్ !! మేం విమానం ఎక్కాం .. మీ ఫ్లైట్ (జి 82610) 45 నిమిషాల పాటు లేట్. నేను మీ సిబ్బందిని అడిగినా, వారికి ఇంకా విమానం ఆలస్యం కావడానికి కారణం తెలియదని సెలవిచ్చారు. నేను మీ గ్రౌండ్ స్టాఫ్ ని అడిగాను .. పైలట్ అందుబాటులో లేరని చెప్పారు, విమానం బయలుదేరడంలో జాప్యం అవుతుందని తెలిసినపుడు ప్రయాణికులకు సమాచారం ఇవ్వడం, లేదా ఫ్లైట్ కనీసం గంట ఆలస్యం అవుతుందని ప్రకటన చేయాలి. కాని విమాన సిబ్బందికి మర్యాద తెలియదు. విమాన జాప్యంపై ప్రకటన చేయడానికి తమకు అధికారం లేదని విమానంలోని సిబ్బంది చెప్పారు… కాని ప్రయాణికులకు విమాన జాప్యంపై ఎవరు తెలియజేస్తారు? విమానం బయలుదేరడంలో తీవ్ర జాప్యం జరిగినా మేం ఇంకా వేచి ఉన్నాం.’’ అని దీపికా కాకర్ ఇన్‌స్టాగ్రాం నోట్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts

రూలర్ : విశాఖపట్నంలో ప్రీ రిలీజ్ ఈవెంట్

vimala p

సరిలేరు నీకెవ్వరు లో … సర్ప్రైస్ లు ఎన్నో తెలుసా..

vimala p

భారత టీం కు ఫీల్డింగ్ కోచ్ గా.. జాంటీ రోడ్స్..!

vimala p