telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘మేల్ ప్రెగ్నెన్సీ’పై సినిమా…!

Pregnancy

ఈ మధ్య బోల్డ్ కంటెంట్లకు కూడా ఆదరణ పెరిగింది. అందుకే వీటిపై వెబ్ సిరీస్ కాకుండా సినిమాలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో బోల్డ్ కంటెంట్ కు ఆదరణ ఎక్కువ. అయితే ఇక ఆడవారి ప్రెగ్నెన్సీ గురించి సినిమాలు రూపొందించిన బాలీవుడ్ మేకర్స్ త్వరలో ‘మేల్ ప్రెగ్నెన్సీ’ అంటే మగవారు గర్భం దాల్చడం పై సినిమా తీయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త దేశమంతా వైరల్ అవుతోంది. బాలీవుడ్ ఇండస్ట్రీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో జనాలలో కూడా ఆసక్తి మొదలైంది. ప్రముఖ హాకీ క్రీడాకారుడు సందీప్ సింగ్ జీవిత కథను తెరకెక్కించిన షాద్ అలీ ఈ మూవీని తెరకెక్కించనున్నారు. అయితే ఈ సినిమాలో దిల్జీత్‌ సింగ్‌ నటించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనులు జరగుతున్నాయి. అయితే ఈ కథా నేపథ్యంలో ఇప్పటికే పంజాబీలో ఓ మూవీ రాగా.. ఆ చిత్ర రీమేక్ కాదని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. ఇక ఇందులో యువ హీరోయిన్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Related posts