telugu navyamedia
సినిమా వార్తలు

“జెర్సీ” హిందీ రీమేక్ కు తెలుగు నిర్మాత ?

Dil-Raju

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు చిన్న, పెద్ద భేదం లేకుండా కథ బాగుంటే అన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరిస్తారు. దాదాపు ఆయన నిర్మాతగా వ్యవహరించిన అని చిత్రాలూ హిట్టే. అయితే దిల్ రాజుకు తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లోనూ సినిమాలను నిర్మించాలనే కాంక్ష బలంగా ఉంది. అందుకే శంకర్, కమల్ హాసన్ భారీ ప్రాజెక్ట్ “భార‌తీయుడు-2″కు నిర్మాతగా వ్యవహరించాలని భావించారు. అయితే క‌మ‌ల్‌, శంక‌ర్ భారీ రెమ్యున‌రేష‌న్, నిర్మాణానికి భారీ బ‌డ్జెట్ అడ‌గ‌డంతో ఆయ‌న వెన‌క‌డుగు వేశారు. అందుకే తెలుగులో ఈ ఏడాది ఆయన నిర్మాతగా వ్యవహరించగా… సంక్రాంతికి విడుద‌లై బ్లాక్‌బ‌స్ట‌ర్‌ హిట్ గా నిలిచిన “ఎఫ్‌-2” చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత బోనీక‌పూర్‌తో క‌లిసి హిందీలోకి రీమేక్ చేస్తున్నారు. తాజాగా దిల్ రాజు “జెర్సీ” చిత్రాన్ని కూడా హిందీలో రీమేక్ చేయ‌బోతున్న‌ట్టు వార్త‌లు ప్రచారం అవుతున్నాయి. “జెర్సీ” హ‌క్కుల‌ను క‌ర‌ణ్ జోహార్ ద‌క్కించుకున్నార‌ని వార్త‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ అది నిజం కాద‌ని అంటున్నారు.

Related posts