telugu navyamedia
సినిమా వార్తలు

వివి వినాయక్ హీరోగా…!

Dil-Rjau-and-VV-Vinayak

టాలీవుడ్ లో మాస్, యాక్షన్ కథాంశాలతో సూపర్ హిట్ సినిమాలను నిర్మించడంలో సిద్ధహస్తుడు దర్శకుడు వివి వినాయక్. అయితే ఇప్పుడు వివి వినాయక్ హీరోగా సినిమా చేయబోతున్నాడనే వార్త వైరల్ గా మారింది. గతంలో వినాయక్‌ దర్శకత్వం వహించిన “ఠాగూర్‌” సినిమాలో చిరంజీవి టీమ్‌లో ఒకరిగా కనిపించి ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఓ ఫుల్‌లెంగ్త్‌ క్యారెక్టర్‌తో అలరించేందుకు సిద్ధమయ్యారు వి.వి.వినాయక్‌. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. దర్శకుడు శంకర్‌ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసి ‘”శరభ”తో దర్శకుడిగా పరిచయమైన ఎన్‌.నరసింహారావు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 1980ల నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రంలో వినాయక్‌ తన వయసుకి తగ్గ పాత్రలో నటించనున్నారని సమాచారం. నాలుగు నెలల్లో ఈ సినిమా సెట్స్‌ మీదకెళ్లనుంది.

Related posts