telugu navyamedia
సినిమా వార్తలు

దిల్ రాజు చేతిలో “సూర్యకాంతం” హక్కులు

Dil-Raju

నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న “సూర్యకాంతం” చిత్రం మార్చి 29న విడుదల కానుంది. రొమాంటిక్ కామెడీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ప్రణీత్ బ్రమండపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి కాగా, నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేతుల మీదుగా ఇప్పటికే విడుదల అయిన ఫస్ట్ లుక్ కు, టీజర్ కు ఫీల్ గుడ్ గా, రీ ఫ్రెషింగ్ గా ఉందంటూ మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు. దిల్ రాజు పంపిణీ చేస్తుండటం సినిమాకు కలిసొచ్చే విషయం. శివాజీ రాజా, సుహాసిని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తుండగా, మార్క్ కె రాబిన్ సంగీతం సమకూరుస్తున్నారు. అమెరికాలో ఫిలిం డిస్ట్రిబ్యూషన్ లో అగ్రగామి సంస్థ అయిన నిర్వాణ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మరి ఈ చిత్రమైనా మెగా హీరోయిన్ నిహారికకు మంచి హిట్ ను అందిస్తుందేమో చూడాలి.

Related posts