telugu navyamedia
telugu cinema news trending

“అల… వైకుంఠపురం”పై దిల్ రాజు మౌనం… కారణం ?

Ay

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ గా వెలుగొందుతున్న నిర్మాత దిల్ రాజు. ఒకవైపు నిర్మాతగా వరుస సినిమాలను నిర్మించే దిల్ రాజు.. మరోవైపు డిస్ట్రిబ్యూటర్ గానూ అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. తాజాగా సంక్రాంతి బరిలో నువ్వా నేనా అంటూ వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల.. వైకుంఠపురములో’ రెండు సినిమాలతోనూ దిల్ రాజుకు సంబంధం ఉంది. మహేశ్ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ తో కలసి నిర్మించిన రాజు.. అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురములో’ చిత్రానికి డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించాడు.తాను నిర్మించే సినిమాలకే కాదు.. పంపిణీ చేసిన చిత్రాలకు సైతం ప్రచారంలో విరివిగా పాల్గొంటాడు దిల్ రాజు. ఇక ఆయా సినిమాల కలెక్షన్ల లెక్కల్ని తానే స్వయంగా వివరిస్తుంటాడు. కానీ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న దిల్ రాజు.. ‘అల.. వైకుంఠపురములో’ సినిమా ఫంక్షన్లకు మాత్రం డుమ్మా కొడుతున్నాడు. అంతేకాదు ఆ సినిమా గురించి కూడా అసలు మాట్లాడకపోవడం గమనార్హం.

Related posts

భయమేస్తోంది… “సాహో” వల్ల నిద్రలేని రాత్రులు… : ప్రభాస్

vimala p

ఎక్కువగా ఫేస్ బుక్ వాడుతుంది.. వృద్దులేనట.. అందుకే అన్ని ఫేక్ న్యూస్.. నివేదిక… 

vimala p

“రాములో రాములా” సాంగ్ కు కొడుకుతో కలిసి శేఖర్ మాస్టర్ డాన్స్

vimala p