telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రస్థానం : “దిల్ ద‌రియాన్” రొమాంటిక్ సాంగ్

PRasthanam

శర్వానంద్‌ హీరోగా 2010లో వ‌చ్చిన “ప్రస్థానం” చిత్రాన్ని హిందీలోకి అనువ‌దిస్తున్న విషయం తెలిసిందే. శర్వానంద్ కెరీర్ లో ది బెస్ట్ మూవీగా నిలిచింది ప్రస్థానం. ఈ మూవీ గ్రామాల‌తో పాటు దేశంలో రాజ‌కీయాల‌ని డిఫ‌రెంట్ లెవ‌ల్‌కి తీసుకెళ్లింది. బాలీవుడ్ హీరో సంజ‌య్ ద‌త్ హీరోగా ప్ర‌స్థానం అనే తెలుగు మూవీ రీమేక్ చేస్తున్నారు. డైరెక్టర్ దేవాకట్ట పొలిటికల్‌ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇప్పుడు తెలుగు చిత్రం ప్ర‌స్థానంని హిందీలోను అదే పేరుతో దేవాక‌ట్ట‌నే తెరకెక్కిస్తున్నాడు. చిత్రంలో సంజ‌య్ ద‌త్‌, మ‌నీషా కోయిరాల‌, అమైరా ద‌స్తూర్‌, అలీ ఫాజ‌ల్, స‌త్య‌జిత్ దుబే, చుంకీ పాండే ప్ర‌ధాన పాత్రలు పోషిస్తున్నారు. రీమేక్‌లో సాయికుమార్ పాత్ర‌ని సంజయ్ దత్, శ‌ర్వానంద్ పాత్రని అలీ ఫాజ‌ల్‌ పోషిస్తున్నారు. ఇటీవ‌ల ట్రైల‌ర్ విడుద‌ల కాగా, దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా “దిల్ ద‌రియాన్” అనే రొమాంటిక్ సాంగ్ విడుద‌ల చేశారు. ఇందులో అలీ ఫాజ‌ల్‌, అమైరా ద‌స్తూర్‌ల రొమాన్స్ అదిరిపోయింద‌నే చెప్ప‌వ‌చ్చు. సెప్టెంబ‌ర్ 20న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Related posts