telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

పలు ఉద్యోగాలకు .. నోటిఫికేషన్లు..

govt jobs notifications by ssc and

నేషనల్ బాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలపమెంట్ 154 గ్రేడ్ ఏ ఆఫీసర్ల భర్తీకి షార్ట్ నోటిస్ విడుదల చేసింది. అసిస్టంట్ మేనేజర్(రూరల్ డెవలప్మెంట్ బాంకింగ్ సర్వీస్) లో 139 ఖాళీలు, రాజభాషా సర్వీస్ లో 8 అసిస్టంట్ మేనేజర్ ఖాళీలు, లీగల్ సర్వీస్ లో 3 అసిస్టంట్ మేనేజర్ ఖాళీలు, ప్రోటోకాల్ సర్వీస్ లో 4 అసిస్టంట్ మేనేజర్ ఖాళీలున్నాయి. ఈ ఉద్యోగాలకి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ జనవరి 10 వ తేదీ, 2020 న ప్రారంభమయి జనవరి 31 వ తేదీ, 2020 తో ముగుస్తుంది.

పూర్తి వివరాలకు : https://www.nabard.org/
———————————————————————–
కేంద్ర రక్షణ శాఖ లోని నావిక్(జనరల్ డ్యూటీ) ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల అయింది. ప్రస్తుతం 260 ఖాళీలు నోటిఫై చేశారు. జనవరి 26 వ తేదీ, 2020 నుంచి ఫిబ్రవరి 2 వ తేదీ, 2020 వరకు దరఖాస్తు ఆన్ లైన్ లో స్వీకరిస్తారు. మాథ్స్,ఫిజిక్స్ సబ్జెక్ట్ ల తో 50 శాతం మార్కులతో ఇంటర్ పాస్ అయిన వారు అర్హులు.18 నుంచి 22 ఏళ్ళ మధ్య వయస్కులు అయి ఉండాలి. ఎంపిక రాత పరీక్ష,ఫిజికల్ టెస్ట్ ల ఆధారంగా ఉంటుంది. రాత పరీక్ష ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగే అవకాశముంది. రాతపరీక్ష లో ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, మాథ్స్, ఫిజిక్స్ తదితర సబ్జెక్ట్ లలో ఆబ్జెక్టివ్ విధానం లో ఉంటుంది.

వివిధ రాష్ట్రాలకి వివిధ రిక్రూట్మెంట్ జోనులు, పరీక్ష కేంద్రాలున్నాయి. తెలంగాణాకి సంబంధించి సికింద్రాబాద్ లోనూ, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి విశాఖపట్నం లోనూ పరీక్ష కేంద్రాలున్నాయి. పూర్తి వివరాలు జనవరి 4 వ తేదీ,2020 ఎంప్లాయ్ మెంట్ న్యూస్ లేదా వెబ్ సైట్ లో చూడవచ్చు www.joinindiancoastguard.gov.in…!

Related posts