telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

లాక్‌డౌన్‌ సడలింపులు.. పెరిగిన పెట్రో ధరలు!

petrol bunk hyd

దేశవ్యాప్తంగా కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలను కేంద్రం సడలించడంతో పలు వాహనాలు రోడ్డెక్కాయి. దీంతో పెట్రో ఉత్పత్తులకు కూడా డిమాండ్‌ పెరుగుతున్నది. వరుసగా మూడోరోజూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచుతూ పెట్రో కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్‌పై 54 పైసలు, డీజిల్‌పై 58 పైసలు పెంచాయి

.దీంతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.73కు, డీజిల్‌ ధర రూ.71.17కి పెరిగాయి. ఇప్పటివరకు ఇవి రూ.72.46, రూ.70.59గా ఉన్నాయి. దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ నేపథ్యంలో గత 82 రోజులుగా పెట్రో ధరల్లో మార్పులు చేయని కంపెనీలు ఆదివారం నుంచి పెంచుతూ వస్తున్నాయి.

తొలి రెండు రోజులు లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై 60ల చొప్పున పెంచాయి. దేశంలోని ఆయిల్‌ కంపెనీలు ప్రతి నెలాఖరులో ధరలపై సమీక్ష జరిపి అంతర్జాతీయ ముడిచమురు ధరల మేరకు సవరించేవి. ఈ విధానానికి స్వస్తి పలికిన కంపెనీలు ప్రస్తుతం రోజువారీగా సమీక్షించి పెట్రో, డీజిల్‌ ధరలను నిర్ణయిస్తున్నాయి.

Related posts